IPS Chandana deepthi: 21 లక్షల విలువ చేసే ఫోన్ల రికవరీ.. సంచలన ప్రకటన చేసిన రైల్వే ఎస్పీ చందనా దీప్తి..

Police Phone theft recovery: కేవలం రెండు నెలల వ్యవధిలోనే పలు రాష్ట్రాల నుంచి చోరీకి గురైన దాదాపు 210 మొబైల్ ఫోన్ లను రికవరీ చేశామని రైల్వే ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా.. జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో 713 మొబైల్ ఫోన్ లను ఓనర్స్ కు అందజేశామని తెలిపారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 23, 2024, 05:20 PM IST
  • చైన్ స్నాచింగ్ వివరాలు వెల్లడించిన ఎస్పీ..
  • సీఈఐఆర్ పోర్టల్ లో అప్లై చేయాలన్న అధికారులు..
IPS Chandana deepthi: 21 లక్షల విలువ చేసే ఫోన్ల రికవరీ..  సంచలన ప్రకటన చేసిన రైల్వే ఎస్పీ చందనా దీప్తి..

SP Chandana deepthi press met over thefting mobiles: ఇటీవల కాలంలో  చాలా మంది బస్సులలో, రైల్వేలలో మొబైల్ ఫోన్ లను పొగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రదేశాలలో దొంగలు ప్రవేశించి, మెల్లగా ఫోన్ లను చోరీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ ,తెలంగాణ, ఆంద్రప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రల లో చోరీ ఫోన్ లను, గోల్డ్ స్నాచింగ్ ఘటనలు అనేకం జరిగాయన్నారు. అనేక మంది బాధితులు పోలీస్ స్టేషన్ లకు వెళ్లి మరీ ఫిర్యాదులు చేశారు.  బ్రాండెడ్ ఫోన్ లు, లగ్జరీ ఫోన్ లే టార్గెట్ గా కొందరు చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

Read more: Bottle gourd: ఇదేం విడ్డూరం.. యువకుడి పొట్టలో తొడిమతో ఉన్న సోరకాయ.. అసలేం జరిగిందంటే..?

దీనిపై తాజాగా, రైల్వే ఎస్పీ చందనా దీప్తి మీడియా సమావేశం నిర్వహించారు. చోరీకి గురైన ఫోన్ లు, బంగారం చైన్ ల వివరాలను వెల్లడించారు. కేవలం.. 2 నెలల వ్యవధి లో 210 మొబైల్స్ చోరీ కి పాల్పడిన రికవరీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా.. Grp పోలీస్ స్టేషన్ నుండి 713 మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్ కి ఇచ్చామని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ ,తెలంగాణ, ఆంద్రప్రదేశ్,బీహార్, తమిళనాడు రాష్ట్రల లో చోరీ, స్నాచింగ్, పోగొట్టుకున్న మొబైల్స్ రికవరీ చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.

 మొబైల్ పోయిన వెంటనే బాధితులు.. CEIR లో పోర్టల్ లో ఫిర్యాదు చెయ్యాలని ఎస్పీ సూచించారు.  దాదాపు.. 25 మంది మొబైల్ పోయాయని  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారన్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని రైల్వే ఎస్పీ తెలిపారు.

Read more: Puja Khedkar: మహానటి.. అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ..

ఇదిలా ఉండగా.. ఇటీవల రేవంత్ సర్కారు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది. దీనిలో భాగంగా  నల్గొండ ఎస్పీగా ఉన్న చందనా దీప్తిని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. చందనా దీప్తిఅధికారిణి ఎక్కడికి వెళ్లిన తనదైన శైలీలో తప్పులు చేసిన వారి ఆగడాలను అడ్డుకుంటున్నారు. ఎస్పీ ముక్కుసూటీగా వ్యవహరిస్తారని, చోరీలు, కేసులు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా నిరంతరం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుటారని చెబుతుంటారు. ఫిర్యాదులు విషయంలొ ఎవరైన అధికారులు నెగ్జీజెన్సీగా ప్రవర్తిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని కూడా చెబుతుంటారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News