Summer Carnival at Hyderabad : హైదరాబాద్‌లో సమ్మర్ కార్నివల్.. మస్త్ మజా

Summer Carnival at Hyderabad : హైదరాబాద్ నగరవాసులకు విభిన్న వినోదాలను అందించేందుకు సమ్మర్‌ ఉత్సవ్‌ మేళా అందుబాటులోకి వచ్చింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో 45 రోజుల పాటు సమ్మర్‌ ఉత్సవ్‌ మేళాను నిర్వహిస్తారు.

Written by - Attili | Edited by - Attili | Last Updated : May 29, 2022, 06:42 PM IST
  • హైదరాబాద్‌లో సమ్మర్ కార్నివల్
  • వేదికగా పీపుల్స్ ప్లాజా
  • 45 రోజుల పాటు సమ్మర్ మేళా
Summer Carnival at Hyderabad : హైదరాబాద్‌లో సమ్మర్ కార్నివల్.. మస్త్ మజా

Summer Carnival at Hyderabad : ఆహ్లాదం పంచే చక్కటి వాతారణం, అబ్బురపరిచే స్టంట్స్‌, రోబోటిక్ పక్షులు, జంతువుల విభిన్న విన్యాసాలు, ఇష్టమైన దుస్తులు, రుచికరమైన ఆహారం అన్నీ ఒకే చోట లభిస్తే అదో అద్భుతం. హైదరాబాద్ నగరవాసులకు ఇలాంటి విభిన్న వినోదాలను అందించేందుకు సమ్మర్‌ ఉత్సవ్‌ మేళా అందుబాటులోకి వచ్చింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో 45 రోజుల పాటు సమ్మర్‌ ఉత్సవ్‌ మేళాను నిర్వహిస్తారు.

కుటుంబ సమేతంగా సమ్మర్‌ మేళాకు వచ్చే వారికి స్వాగతం పలికేందుకా అన్నట్లు ఏర్పాటు చేసిన రోబోటిక్ జంతువులు, పక్షులు ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అద్భుత కట్టడాలు, త్రీడి చిత్రాలతో సెల్ఫీ జోన్  అందరిని ఆకట్టుకుంటోంది. హాండీక్రాప్ట్, ఫుట్ వేర్, డ్రెస్ మెటీరియల్, గృహ అలంకరణాలు, పుట్ వేర్ ఇలా వివిధ రకాల ఉత్పత్తులతో 250 రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు.

వంద అడుగుల ఎత్తులో గుండ్రంగా నిర్మించిన చెక్కలపై కార్లు, మోటార్ సైకిళ్లు తిరుగుతూ చేసే అద్భుత స్టంట్లు చూపరులను కళ్లు తిప్పుకోకుండా చేస్తాయి. జాయింట్ వీల్, టోరా టోరా, బ్రేక్ డ్యాన్స్, డ్రాగన్ ట్రేయిన్, ఆక్టోపస్ బౌస్సర్ వంటి దాదాపు 30 రకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడుపుదామనుకుంటున్నారా ? ఇంక ఆలస్యం ఎందుకు ఓ సారి సమ్మర్ మేళాను సందర్శిస్తే పోలా...

Also Read: Lady Cop arrests Fiance : కాబోయే వాడిని కటకటాల వెనక్కి నెట్టిన సూపర్ కాప్.. ఎందుకంటే ?

Also Read: Terrorists Plot For Bomb Blasts: దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. తెలంగాణకు ఆయుధాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News