Telangana Election 2023: తెలంగాణ ఎన్నికలకు అంతా సిద్ధం, 12 వేల సమస్యాత్మక ప్రాంతాలు, ఐదంచెల భద్రత

Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక పోలింగ్ ఒక్కటే మిగిలింది. ప్రచారపర్వం ముగిసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2023, 06:03 PM IST
Telangana Election 2023: తెలంగాణ ఎన్నికలకు అంతా సిద్ధం, 12 వేల సమస్యాత్మక ప్రాంతాలు, ఐదంచెల భద్రత

Telangana Election 2023: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఒక్కటే మిగిలింది. ఇవాళ్టితో ప్రచారపర్వం ముగిసింది. నవంబర్ 30 పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రచారం ముగియగానే రాష్ట్రంలో సెక్షన్ 144 అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల ప్రధానాదికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు ఆంక్షలు విధించారు. 

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు ఎల్లుండ గురువారం అంటే నవంబర్ 30 పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ ముగిసేవరకూ ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని, స్థానికేతరులు నియోజకవర్గాల్ని వదిలిపెట్టాలని సూచించారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని తెలిపారు. పోలింగ్ స్టేషన్‌కు మొబైల్ అనుమతి లేదన్నారు. సోషల్ మీడియాలో సైతం ఏ విధమైన ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన అరంగట వరకూ ఎగ్జిట్ పోల్స్ వెలువరించడం నిషేధమన్నారు. ఓటరు స్లిప్పులపై ఎలాంటి పార్టీ గుర్తులుండకూడదన్నారు. ఈ నెల 30 వరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. 

రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఈవీఎం మెషీన్లు వినియోగించనున్నారు. అదనంగా మరో 14 వేలు రిజర్వ్‌లో ఉంచారు. తెలంగాణలో మొత్తం 3 కోట్ల 26 లక్షల 98 వేల 418 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 1 కోటి 62 లక్షల 98 వేల 418 కాగా, మహిళలు1 కోటి 63 లక్షల 1705 ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 5 లక్షల 6 వేల 921 మంది ఉన్నారు. రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 12 వేలుగా గుర్తించారు. ఇందులో గ్రేటర్ పరిధిలో 1800 ఉన్నాయి. మూడు, ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 6 వందల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలున్నాయి. 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షలమంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. అంటే 13 నియోజకవర్గాలు మినహా మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. 

Also read: Telangana Elections 2023: తెలంగాణలో చివరి 48 గంటల్లో ఏం జరగనుంది, ఫలితాలే మారిపోయే పరిస్థితి ఉందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News