Bandi Sanjay Speech At Booth Swashakthikar Abhiyan Workshop: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగానే పూర్తిస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంస్థాగత నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లతో పోలిస్తే బీజేపీయే బలంగా ఉందన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ వర్క్ షాప్ ప్రారంభమైంది. బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ భన్సల్, ఇతర కీలక నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలకు సంస్థాగతంగా బూత్ కమిటీల్లేవని.. సంస్థాగతంగా బలంగా లేని పార్టీలు సుధీర్ఘ కాలం మనుగడ సాధించలేవన్నారు. బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉన్నందునే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని చెప్పారు. మధ్యప్రదేశ్, గుజరాత్‌లో సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్నందున ఓటు బ్యాంకు పెంచుకుంటూ అధికారంలోకి ఉన్నామని అన్నారు. దేశంలోనూ రెండుసార్లు విజయం సాధించామని.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించబోతున్నామన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
'తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే సంస్థాగతంగా బలోపేతానికి కృషి చేస్తున్నాం. 34 వేల పోలింగ్ బూత్ కమిటీలుంటే అందులో 80 శాతం కమిటీలను పూర్తి చేశాం. అయిననప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కావాలనే బీజేపీకి అభ్యర్థుల్లేరని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 56 నియోజకవర్గాల్లో పర్యటిస్తే నాయకులు పోటీ పడ్డారు. ఉఫ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అని తేల్చేశారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లతో పార్టీకి మంచి వాతావరణం ఏర్పడింది. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది..
వీటితోపాటు ఎన్నికల్లో గెలిచాక ఏ హామీలను అమలు చేస్తామో చెబుతున్నాం. అందులో భాగంగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం, అందరికీ ఇండ్లు, రైతులకు ఫసల్ బీమాను అమలు చేస్తామని చెప్పాం. కేంద్రం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెబుతున్నాం. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో.. అభివృద్ధి ఎందుకు చేయడం లేదో చెప్పడం లేదు. వాటిపై సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించడానికే ప్రధానమంత్రి మోదీపైన, బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కేంద్రం తెలంగాణకు పైసలు ఇవ్వడం లేదని అబద్దాలు చెబుతున్నారు. దీనిపై బహిరంగ చర్చకు పలుమార్లు సిద్ధమని సవాల్ విసిరినా ఆ పార్టీ నేతలు తోకముడిచారు..' అని బండి సంజయ్ అన్నారు.
Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు
Also Read: Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి