తెలంగాణ ఇంటర్ బోర్డు, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను రేపు(ఏప్రిల్ 13, 2018) ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులు bse.telangana.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు.
ఫిబ్రవరి 28 నుంచి మార్చి19 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,63,546 మంది విద్యార్థులు హాజరు కాగా… వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 4,55,635 మంది… సెకండియర్ విద్యార్థులు 5,07,911 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేరోజు విడుదల చేయనున్నారు. తెలంగాణ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను results.nic.in, examresults.netలలో కూడా చూసుకోవచ్చు.
తెలంగాణ స్టేట్ బోర్డు ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను ఈ విధంగా చూసుకోవచ్చు:
* bse.telangana.gov.in అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
* మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2018 అనే లింక్ మీద, ఇంటర్ సెకండియర్ అయితే సెకండియర్ ఫలితాలు 2018 అనే లింక్ మీద క్లిక్ చేయండి.
* అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేయండి. మీ రోల్ నెంబర్ మరియు ఇతర వివరాలను నమోదు చేయండి.
* సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
* మీరు తెలంగాణ బోర్డు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు 2018, తెలంగాణ బోర్డ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు 2018లను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
మొబైల్ ద్వారా:
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు 2018 కోసం:
GENERAL - SMS - TSGEN1 <space> రిజిస్ట్రేషన్ నెంబర్ ను టైప్ చేసి 56263కు పంపించండి.
VOCATIONAL - SMS - TSVOC1 <space> రిజిస్ట్రేషన్ నెంబర్ ను టైప్ చేసి 56263కు పంపించండి.
తెలంగాణ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాలు 2018 కోసం:
GENERAL - SMS - TSGEN2 <space> రిజిస్ట్రేషన్ నెంబర్ ను టైప్ చేసి 56263 కు పంపించండి.
VOCATIONAL - SMS - TSVOC2 <space> రిజిస్ట్రేషన్ నెంబర్ ను టైప్ చేసి 56263 కు పంపించండి.