తెలంగాణ కేబినెట్‌: జీతాలు, వయోపరిమితి పెంచుతూ కీలక నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.

Last Updated : Sep 3, 2018, 11:29 AM IST
తెలంగాణ కేబినెట్‌: జీతాలు, వయోపరిమితి పెంచుతూ కీలక నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలకాంశాలపై చర్చించింది. సమావేశం అనంతరం మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్ రావు, కడియం శ్రీహరిలు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలివే:

  • హైదరాబాద్‌లో 71 ఎకరాల్లో చేపట్టే  బీసీల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు రూ.71కోట్లు కేటాయింపు. 
  • గోపాల మిత్రల గౌరవ వేతనాన్ని రూ.3,500 - రూ.8,500లకు పెంపు.
  • కంటి వెలుగు కార్యక్రమంపై కేబినెట్‌ సంతృప్తి.
  • అర్చకుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం. అర్చకుల జీతాలను ప్రభుత్వమే చెల్లించేలా ఆమోదం.
  • ఎన్‌యూహెచ్‌ఎంలో పనిచేస్తున్న 9వేల మందికి కనీస వేతనాలు పెంపుకు నిర్ణయం.  
  • హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు,
  • ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంచుతూ నిర్ణయం.
  • వైద్యారోగ్య శాఖలో శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు,
  • కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం రూ. 40 వేలకు పెంపు.
  • సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 9వ బెటాలియన్ ఏర్పాటుకు నిర్ణయం.

Trending News