Revanth Delhi Tour: తెలంగాణలో అనూహ్య పరిణామాల మధ్య ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా.. ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విజ్ఞప్తులు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. ముఖ్యంగా 12 అంశాలపై ప్రధానికి విన్నవించారు.
Also Read: KCR Farmhouse: దిష్టిపోయింది.. ఇక అన్నీ మంచి శకునములే: మాజీ సీఎం కేసీఆర్
ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో గురువారం వారిద్దరూ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీ తో పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలు అందించారు. ఇక హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరాలు వెల్లడించారు.
Also Read: KCR: బరాబర్ ఈసారి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనే.. రావడమే కాదు 15 ఏళ్లు పాతుకుపోతాం
'ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతో ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశాం. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరించాలి. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో పొందుపర్చిన హక్కులపై ప్రధాని, కేంద్ర హోంమంత్రితో మాట్లాడాం. రోడ్లు, ఐటీఐఆర్, బొగ్గు గనుల వేలం, ఐఐఎం, నవోదయ, ఇండ్ల నిర్మాణం వంటి 12 అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు ఇచ్చాం' అని భట్టి విక్రమార్క తెలిపారు.
కేంద్రానికి తెలంగాణ వినతులు
1. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు బొగ్గు బ్లాకుల కేటాయింపు
2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
3. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ ప్రాజెక్ట్
4. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ
6. ఐదేండ్లలో 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలి
7. పెండింగ్‌లో ఉన్న వెనుకబడిన ప్రాంతాల నిధుల విడుదల
8. రక్షణ శాఖ భూముల బదిలీ
9. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు
10. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం
11. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలి.
12 కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter