CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అర్ధం కావంటారు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్టం. ఎప్పటికప్పుడు తన స్టాండ్ మారుస్తుంటారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని గులాబీ నేతలు చెబితే.. అనాలోచిత నిర్ణయాలు తీసుకుని తర్వాత మార్చుకుంటారని కేసీఆర్ ప్రత్యర్థులు చెబుతుంటారు. తాజా సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణే కాదు దేశ వ్యాప్తంగా సంచలనమవుతోంది.
భారత 15వ రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్మును కలవబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతున్న కేసీఆర్.. రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్రపతి ప్రమాణం చేసిన ఆమెరు శుభాకాంక్షలు చెప్పనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు కాకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చారు సీఎం కేసీఆర్. సిన్హాకు మద్దతుగా హైదారాబాద్ సభ పెట్టి హంగామా చేశారు. గిరిజన నేతకు కాకుండా సిన్హాకు కేసీఆర్ సపోర్ట్ చేయడంపై ఆదివాసీ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు. కాని ఇప్పుడు మాత్రం ద్రౌపది ముర్మును కలవబోతుండటం ఆసక్తిగా మారింది.
రెండు, మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్. జాతీయ రాజకీయాలపై కొందరు కీలక నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. కొందరు మంత్రులు, సీనియర్ నేతలు కేసీఆర్ తో పాటు ఢిల్లీకి వెళుతున్నారు. గతంలోనూ ఢిల్లీలో దాదాపు వారం రోజుల పాటు మకాం వేశారు సీఎం కేసీఆర్. పలువురు నేతలతో చర్చలు జరిపారు. పలు పార్టీల అధినేతలను, పలువురు ముఖ్యమంత్రులను కలిసి చర్చించారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక సైలెంట్ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని అనుకున్నా ఆయన అలాంటి ప్రయత్నం చేయలేదు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. కాని ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. విపక్షాలు తమ అభ్యర్థిగా ప్రకటించిన మార్గరేట్ ఆల్వారు మద్దతు తెలపలేదు. కాంగ్రెస్ నాయకురాలు కాబట్టే మద్దతు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రపతిగా గెలిచిన ద్రౌపది ముర్మును సీఎం కేసీఆర్ కలుస్తుండటం చర్చగా మారింది.
Read also: థియేటర్‌లో సినిమా చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే?
Read also: Weight Loss: ఈ గ్రీన్ టీని రెగ్యూలర్‌గా తాగడం వల్ల.. 5 రోజుల్లో బరువు తగ్గుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
CM KCR: సీఎం కేసీఆర్ మరో సంచలనం.. సాయంత్రం ఢిల్లీకి పయనం
సాయంత్రం ఢిల్లీకి సీఎం కేసీఆర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశం
రెండు, మూడు రోజులు హస్తినలోనే సీఎం