Revanth Reddy meet Modi: ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Revanth Reddy meet Modi: తెలంగాణ ముఖ్యమంత్రిగా తొలిసారిగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 26, 2023, 06:14 PM IST
Revanth Reddy meet Modi: ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దేశ ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు భేటీ అయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావల్సిన పెండింగు నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇదే తొలిసారి ప్రధానితో భేటీ అవడం. 

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారిక హోదాలో తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మద్యాహ్నం 4 గంటల సమయంలో మోదీని కలిసిన రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు దాదాపు గంట సేపు రాష్ట్ర సంబంధిత అంశాలపై చర్చించారు. పెండింగులో ఉన్న విభజన హామీలు, రాష్ట్రానికి రావల్సిన బకాయిలపై చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావల్సిన బకాయిలపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధికై కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి గొడవలు, భేషజాల్లేకుండా సఖ్యతతో మెలగాలని ఇటీవల రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్‌లను కూడా కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనీసం 12 గెలిచే విధంగా అవసరమైన కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చెబుతోంది. రాష్ట్రంలో 50 వరకూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి ఈ పదవులు వరించనున్నాయి. 

Also read: 2024 Public Holidays: ఏపీ వాసులకు శుభవార్త.. 2024లో ప్రభుత్వ సెలవులు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News