Telangana Covid-19: కొత్తగా 627 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో శుక్రవారం ( డిసెంబరు 18న ) రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 627 కరోనా కేసులు నమోదయ్యాయి.

Last Updated : Dec 19, 2020, 09:43 AM IST
Telangana Covid-19: కొత్తగా 627 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో శుక్రవారం ( డిసెంబరు 18న ) రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 627 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,80,822 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,510 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా ( Covid-19 )  కేసులతోపాటు రాష్ట్రంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. అయితే గత 24 గంటల్లో కరోనా నుంచి 721 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ( Telangana ) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,72,370 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 6,942 కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.99 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. Also read: Hathras Case: గ్యాంగ్ రేప్ నిజమే.. సీబీఐ చార్జిషీట్

ఇదిలావుంటే.. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా 46,694 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు. వీటితో కలిపి డిసెంబరు 18వ తేదీ వరకు మొత్తం 64,01082 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  హైదరాబాద్ పరిధిలో 123 కేసులు నమోదయ్యాయి. 

Also read: Covid-19: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, ఐసీఎంఆర్ చీఫ్‌కు కరోనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News