Telangana Covid-19: కొత్తగా 609 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 600లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.

Last Updated : Dec 3, 2020, 09:29 AM IST
Telangana Covid-19: కొత్తగా 609 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 600లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( డిసెంబరు 2న ) బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 609 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మహమ్మారి కారణంగా నిన్న ముగ్గురు (3) ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల ( positive cases) సంఖ్య 2,71,492 కి చేరగా.. మరణాల సంఖ్య 1,465 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

గత 24గంట్లలో 873 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,61,028 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 8,999 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.14 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. Also read: TS ICET-2020: టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఇదిలావుంటే.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా 53,686 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి డిసెంబరు 2వ తేదీ వరకు మొత్తం 56,05,306 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 114 కేసులు నమోదయ్యాయి. Also read: Yada Krishna: టాలీవుడ్ నటుడు కన్నుమూత

 

Also read: GHMC Elections: ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్ ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News