కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు  

                     

Last Updated : Dec 10, 2018, 01:20 PM IST
కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు  

తెలంగాణ ఎన్నికల ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి అంచెలో వాహనాలు తనిఖీ చేసి పాస్ ఉన్న వారికే లోపలికి అనుమతి ఇస్తారు. రెండో అంచెలో పోలింగ్ కేంద్రానికి 500 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాట్లు చేసి భద్రతా దళాలు గస్తీకాస్తున్నాయి. ఇక్కడ వివిధ పార్టీల నుంచి వచ్చే ఎజెంట్లను తనిఖీలు చేసి లోనికి పంపిస్తారు. మూడో అంచెలో సిసి కెమెరాల నిఘాలో కేంద్ర బలగాలు భద్రతను పర్యవేక్షించనున్నాయి. 

కాగా సిసి కెమెరాలు నిఘాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరనుంది. ఉదయ 8 గంటలకు  ప్రారంభం కానున్న కౌంటింగ్ మూడు గంటల్లో  ముగియనుంది. అనంరతం పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల్లోపు ఫలితాలు వెల్లడికానున్నాయిని ఎన్నికల అధికారి తెలిపారు

Trending News