Saraswati River Pushkaralu 2025: సరస్వతి నది పుష్కరాలకు తెలంగాణ సర్కార్ భారీగా నిధులు మంజూరు చేసింది. రూ. 25కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సరస్వతీ నది పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
మరోవైపు సరస్వతి నది పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనతోపాటు స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం వంటి పనులకు పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ లను మంత్రిగుండా సురేఖ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టి పుష్కరాలను విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రఏర్పాటుకు ముందు 2013లో వచ్చిన సరస్వతీ నది పుష్కరాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిన విషయాన్ని మంత్రి కొండా సురేఖ గుర్తు చేశరు. కాగా సరస్వతీ పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండగ. ఇది సాధారణంగా ప్రతి 12ఏళ్లకు ఒకసారి వస్తుంది.
2025 మే 14వ తేది రాత్రి 10.34గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం అవుతుంది. మే 15న సూర్యోదయంతో పుష్కర పుణ్యస్నానాలు ప్రారంభం అవుతాయి. పుష్కరాలు మే 26వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పుష్కరాల నిర్వహణ తేదీలను కాళేశ్వరం ఆలయ ముఖ్య అర్చకులు నిర్ణయించారు. ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. సరస్వతీ నది త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా భావిస్తారు. పుష్కర సమయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
Also Read:Jio Coin vs Bitcoin: జియో కాయిన్ వర్సెస్ బిట్ కాయిన్..ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ముఖేశ్ అంబానీ కొత్త ప్రాజెక్ట్ లక్యం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook