Governor Tamilisai Approves For TSRTC Merger Bill: ఉత్కంఠ వీడింది. ప్రభుత్వంలో టీఎస్‌ఆర్‌టీసీ విలీనంపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే విషయంపై ప్రభుత్వం కాసేపట్లో క్లారిటీ ఇవ్వనుంది. బిల్లుపై గవర్నర్ పలు వివరణలు కోరగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం అధికారులతో సమావేశమైన గవర్నర్.. చర్చల అనంతరం బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేడే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఆర్టీసీ కార్మికులకు తాను వ్యతిరేకం కాదని గవర్నర్ తమిళ సై మరోసారి చెప్పారు. వారి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ బిల్లుపై రెండుసార్లు వివరణ ఇచ్చినా.. సంతృప్తి చెందలేదు. దీంతో నేడు మధ్యాహ్నం రవాణా కార్యదర్శి, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్‌తో సమావేశం అయి క్లారిఫికేషన్ ఇచ్చారు. అనంతరం ఆమె బిల్లుకు ఆమోద ముంద్ర వేయడంతో రవాణాశాఖ అధికారులు అసెంబ్లీకి చేరుకున్నారు. గవర్నర్ తమిళసైతో చర్చించిన అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరించే అవకాశం ఉంది. అనంతరం సభ ముందుకు ఆర్టీసీ బిల్లు రానుంది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల 31న జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసి.. గవర్నర్ అనుమతి కోసం రాజ్‌భవన్‌కు పంపించారు. అయితే బిల్లులో పేర్కొన్న పలు అంశాలపై గవర్నర్ వివరణ కోరారు. ప్రభుత్వం ఒకసారి సమాధానం ఇవ్వగా.. అదనపు సమాచారం కోసం గవర్నర్ రెండోసారి వివరాలు అడిగారు. దీంతో బిల్లుకు ఆమోదం లభిస్తుందా..? లేదా..? అని సస్పెన్స్ నెలకొంది.
గవర్నర్ తీరును నిరసిస్తూ ఆర్టీసీ సంఘాలు ఆందోళన కూడా నిర్వహించాయి. శనివారం ఉదయం రెండు గంటలపాటు బస్సులను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశాయి. రాజ్‌భవన్‌ను కార్మికులు ముట్టడించగా.. అప్పటికి చెన్నైలో ఉన్న గవర్నర్ తమిళసై.. పది మంది ఆర్టీసీ సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాను బిల్లుకు వ్యతిరేకం కాదని.. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత ఆమోదం తెలుపుతానని హామీ ఇచ్చారు. ఆదివారం అధికారులతో సమావేశం అనంతరం ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి