Telangana: సచివాలయం కూల్చివేతపై 15వరకు స్టే

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి మరోసారి అడ్డంకి ఎదురైంది. ఈనెల 13వ తేదీ వరకు భవనాల కూల్చివేతను ఆపాలన్న స్టేను  మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

Last Updated : Jul 13, 2020, 07:09 PM IST
Telangana: సచివాలయం కూల్చివేతపై 15వరకు స్టే

Secretariat demolition: హైదరాబాద్:  తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి ( Telangana Govt ) మరోసారి అడ్డంకి ఎదురైంది. ఈనెల 13వ తేదీ వరకు భవనాల కూల్చివేతను ఆపాలన్న స్టేను  మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ( Telangana High court ) ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతను ఆపాలని కోరుతూ ఇటీవల విశ్వేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేయగా.. విచారించిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేంత వరకు పనులు ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు కూల్చివేతపై విధించిన స్టేను ఈనెల 15వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. Also read: Doctor on Tractor: కరోనా రోగి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకెళ్లిన డాక్టర్ 

అయితే సచివాలయం కూల్చివేతపై ప్రభుత్వం జూన్ 30న నిర్ణయం తీసుకుందని అటార్నీ జనరల్ ధర్మాసనానికి వివరించగా.. క్యాబినెట్ ప్రతిని సమర్పించకుంటే ఎలా విచారించాలని హైకోర్టు ప్రశ్నించింది. మంత్రివర్గ నిర్ణయ ప్రతులను షీల్డు కవర్‌లో సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. Also read: Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం

ప్రభుత్వం ధాఖలు చేసిన కౌంటర్‌పై అభ్యంతరాలుంటే కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది. ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. Also read: Facebook Ban: కోర్టును ఆశ్రయించిన ఆర్మీ అధికారి

Trending News