టిఎస్ఆర్టీసి సమ్మెపై హోంమంత్రి స్పందన

టిఎస్ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించుకుని ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ విజ్ఞప్తి చేశారు. సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరయ్యే సిబ్బంది, కార్మికులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్షణ కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకుని ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగించిన వారు ఎవరైనా.. వారిపై కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు. 

Last Updated : Oct 5, 2019, 11:55 PM IST
టిఎస్ఆర్టీసి సమ్మెపై హోంమంత్రి స్పందన

హైదరాబాద్‌: టిఎస్ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించుకుని ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ విజ్ఞప్తి చేశారు. సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరయ్యే సిబ్బంది, కార్మికులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్షణ కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకుని ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగించిన వారు ఎవరైనా.. వారిపై కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు. 

ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా విధుల్లో ఉన్న సిబ్బందికి పోలీసులు రక్షణగా ఉండి సహకరిస్తున్నారని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు.

Trending News