She Team Serious On Lovers Behaviour: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి అందరు ఆర్యోగ్యం మీద కాస్తంతా శ్రధ్ద తీసుకున్నట్లు చెప్పవచ్చు. ఎంత బిజీగా ఉన్న ఉదయం పూట కాసేపైన దగ్గరలో ఉన్న పార్కులకు వెళ్లి వాకింగ్ చేస్తుంటారు. యోగాసనాలు, ధ్యానం చేస్తుంటారు. పార్కులలో పెద్ద చెట్లు నుంచి వచ్చే చల్లని ఫ్రెష్ గాలిని ఆస్వాదిస్తూ కాసేపు సేదతీరుతుంటారు. ముఖ్యంగా సీనియన్ సిటిజన్స్ ఎక్కువగా పార్కులకు వెళ్తుంటారు.
Read More: Summer Foods: వేసవిలో ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు ఒంట్లో వేడి మొత్తం మాయం..
వర్కింగ్ ఎంప్లాయిస్ కూడా పార్కులో వాకింగ్ చేయడం మనం తరచుగా చూస్తుంటాం. ఒక వేళ ఉదయం పూట.. సమయం లేని వారు సాయత్రం పూట వాకింగ్ లకు వెళ్తుంటారు. అనేక వీధులలో అపార్ట్ మెంట్ లలో, కాలనీలలో తప్పకుండా పార్కులు ఉండేలా చూసుకుంటారు. కొన్ని చోట్ల ప్రభుత్వాలు పార్కులను ఏర్పాటు చేస్తుంటారు.
ఇదిలాఉండగా.. ఈ పార్కులలో కొందరు అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతుంటారు. దీంతో వాకింగ్ కు వచ్చిన మిగతావారు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇదిలా ఉండగా వరుసగా అనేక ఫిర్యాదులు వస్తుండటంతో హైదరాబాద్ లోని షీటీమ్స్ పోలీసులు సీరియస్ అయ్యారు.
కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని ఇందిరాపార్కు , నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్కులలో లవర్ లు అతిగా ప్రవర్తిస్తున్నారని కొన్నిరోజులుగా షీటీమ్స్ పోలీసులకు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై సీరియస్ గా చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక మీదట పార్కులో లవర్స్ అసాంఘిక చర్యలకు పాల్పడుతూ.. దొరికితే తీవ్రమైన పరిణామాలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇతరులకు ఇబ్బందులు కల్గకుండా హుందాగా నడుచుకొవాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ లోని ఇందిరా పార్కు, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్కులలో 12 జంటలను షీటీమ్స్ పోలీసులు పట్టుకుని పీఎస్ కు తరలించారు. అంతే కాకుండా.. వారి కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read More: Samantha Stills: అడవిలో అందాల సెగలు రేపుతున్న సమంత.. సరస్సులో హాట్ ఫొటోలు
మరోసారి చిక్కితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం. మంచి జీవితాన్ని పాడుచేసుకొవద్దని, కష్టపడి చదవి, జీవితంలో సెటిల్ కావడం మీద కాన్సెన్ ట్రేషన్ చేయాలని పోలీసులు యువతకు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook