తెలంగాణలో ఉర్దూ రెండో అధికార భాష

తెలంగాణ శాసనసభ ఉర్దూ రెండో అధికార భాష బిల్లు, లోకాయుక్త చట్ట సవరణ బిల్లు, దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.

Last Updated : Nov 17, 2017, 03:33 PM IST
    • కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన సభ
    • ఉర్దూ రెండో అధికార భాష బిల్లుకు ఆమోదం
    • లోకాయుక్త, దేవాదాయ బిల్లులకూ ఆమోదం
తెలంగాణలో ఉర్దూ రెండో అధికార భాష

తెలంగాణ  శాసనసభ గురువారం కొన్ని కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉర్దూను రెండో అధికార భాషగా చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.  ఈ నేపథ్యంలో గురువారం అధికార భాష సవరణ బిల్లును సీఎం తరుపున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టగా, చర్చ జరిగిన తరువాత ఆ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇదే సభలో లోకాయుక్త చట్ట సవరణ బిల్లు, దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లుకు సభ అంగీకారం తెలిపింది. మూడు బిల్లులకు ఆమోదం తెలిపిన తరువాత సమర్ధించిన అన్ని పార్టీలవారికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ తెలుగు భాషపై శుక్రవారం ప్రకటన చేయాల్సి ఉంది.

Trending News