Telangana New Home Minister Uttam Kumar Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితోపాటు మంత్రులుగా మరో 11 మంది గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంతో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత హోంమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 8 ఏళ్లుగా చేపట్టిన దీక్షకు తెరపడనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు గడ్డం తీయనని ఆయన శపథం చేసిన విషయం తెలిసిందే.
2016లో టీపీసీసీ అధ్యక్షుడిగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టే వరకు తాను గడ్డం తీయనని వెల్లడించారు. 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాతో ఈ మాట చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోగా.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ ఎన్నికల వరకు ఆయన నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో అద్భుత విజయంతో పార్టీ అధికారంలోకి రావడంతో ఎట్టకేలకు ఆయన నిరీక్షణకు తెరపడింది. పార్టీ గెలిచిన రోజే.. తాను గడ్డం తీసేసే సమయం ఆసన్నమైందన్నారు.
రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయగా.. ఉప ముఖ్యమంత్రిగా మరో ప్రముఖ నేత విక్రమార్క మల్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఉత్తమ్‌కు కీలకమైన హోం శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. 2014 శాసనసభ ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో కేవలం 21 సీట్లను మాత్రమే ఆ పార్టీ కైవసం చేసుకోగలిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో 64 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
Also Read: New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..
Also Read: CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డి 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆ రోజు చేసిన శపథంతో ఇన్నాళ్లు ఇలా..!