Corona in Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా 3,557 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం బుధవారం వెల్లడించింది. మొత్తం 1,11,178 టెస్టులకుగానూ.. ఈ కేసులు (Corona tests in Telangana) నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 7,18,196కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది.
మంగళవారం సాయంత్రం ఐదున్నర నుంచి నేడు (బుధవారం) సాయంత్రం 5:30 వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.
మొత్తం కేసుల్లో 1,474 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు (Corona cases in GHMC) ఆరోగ్య విభాగం వివరించింది.
రాష్ట్రంలో కరోనా మృతులు..
కొవిడ్ కారణంగా తాజాగా మరో ముగ్గురు మృతి (Corona Deaths in Telangana) చెందారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,065కు చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.
ఇక గడిచిన 24 గంటల్లో 1,773 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,89,878 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.06 శాతానికి తగ్గింది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 24,253 యాక్టివ్ కొవిడ్ (Active cases in Telangana) కేసులు ఉన్నాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.19.01.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/9UewyGCuKu— IPRDepartment (@IPRTelangana) January 19, 2022
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,09,28,740 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. ప్రతి పది లక్షల మందికి గానూ.. 8,30,971 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇంకా 11,949 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.
Also read: ఇటీవల 'పుష్ప'లో మెరిసిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి... ఆమె మృతిపై తండ్రి అనుమానాలు...
Also read: Rs.10 Clinic: హైదరాబాద్‌లో 10 రూపాయల డాక్టర్.. క్యూ కడుతున్న జనం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook