Medaram Jatara: హైదరాబాద్- మేడారం వయా వరంగల్.. జాతరకు బస్ టిక్కెట్ ధరలు.. సమయం..

RTC Bus To Medaram: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు

Written by - Renuka Godugu | Last Updated : Feb 8, 2024, 01:14 PM IST
Medaram Jatara: హైదరాబాద్- మేడారం వయా వరంగల్.. జాతరకు బస్ టిక్కెట్ ధరలు.. సమయం..

RTC Bus To Medaram: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతరలు నిర్వహించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీంతో మన రాష్ట్రానికి చెందిన మహిళలు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. అయితే, మేడారం జాతరకు కూడా ఉచిత బస్సు సౌకర్యం పథకం వర్తిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే..

ఇదీ చదవండి: Free Bus To Medaram: మేడారం జాతరకూ ఉచిత బస్సు.. పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది: డిప్యూటీ సీఎం

ఇదిలా ఉంటే హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు బస్సు వేళలు, ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు రేపటి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టీఎస్‌ఆర్‌టీసీ రీజనల్ మేనేజర్ శ్రీధర్ బస్సులు వేళలు, ఛార్జీలను తెలిపారు. మేడారం జాతరకు హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకుంటున్న భక్తులు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సులు ఉదయం 6.00, 06:30, 07:00 అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..

ఇక బస్సు ఛార్జీల విషయానికి వస్తే పెద్దలకు రూ.750,  పిల్లలకు రూ.450 ఒక్క టిక్కెట్ గా నిర్ణయించారు.
ఈ సూపర్ లగ్జరీ బస్సు రూట్లు ఉప్పల్- వరంగల్ మీదుగా మేడారం జాతర ప్రాంగణానికి చేరుకుంటుందట.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News