Family Cards: రంగంలోకి 'ఒక రాష్ట్రం-ఒక కార్డు'.. ఐదు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన

Telangana Planning To One Card One State: ప్రయోగాత్మక చేపడుతున్న 'ఒక రాష్ట్రం-ఒక కార్డు' ప్రాజెక్టును అమలు చేసేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది. ఐదు రోజుల పాటు పైలెట్‌టా ఐదు రోజులుగా చేపట్టనున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 30, 2024, 04:55 PM IST
Family Cards: రంగంలోకి 'ఒక రాష్ట్రం-ఒక కార్డు'.. ఐదు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన

Telangana One Card One State: దేశంలో ఎక్కడా లేని విధంగా సరికొత్తగా రేషన్‌, ఆరోగ్య కార్డులను జోడించి 'ఒక రాష్ట్రం-ఒక కార్డు' పేరిట కుటుంబ డిజిట‌ల్ కార్డులు అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపడుతుండడంతో పరిశీలించేందుకు ఐదు రోజుల పాటు పైలెట్‌ పనులు మొదలుపెట్టారు. ఈనెల 3 నుంచి 7వ తేదీ వ‌ర‌కు పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ చేసేందుకు అధికార బృందం సిద్ధమైంది.

Also Read: Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో భారీ దొంగతనం.. బెంగాల్‌లో దొంగలు అరెస్ట్‌

 

రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఈ ప్ర‌క్రియ‌ కొనసాగనుంది. ప‌ట్ట‌ణ/న‌గ‌ర ప్రాంతాల్లో జ‌నాభా ఆధారంగా ఎక్కువ బృందాలు పర్యటించనున్నాయి. అయితే కుటుంబ ఫొటో దిగ‌డం మాత్రం ఆప్ష‌న్‌గా పెట్టారు. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయిలో పైలెట్ ప్రాజెక్టుగా చేప‌ట్ట‌నున్న ప‌రిశీల‌న స‌మ‌ర్థంగా చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి అధికారులకు ఆదేశించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక ప‌ట్ట‌ణ‌, ఒక గ్రామీణ ప్రాంతాన్ని, పూర్తిగా ప‌ట్ట‌ణ/న‌గ‌ర ప్రాంత‌మైతే రెండు వార్డులు/ డివిజ‌న్లు, పూర్తిగా గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గ‌మైతే రెండు గ్రామాల్లో మొత్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. వార్డులు/ డివిజ‌న్ల‌లో జ‌నాభా ఎక్క‌వగా ఉండే అవ‌కాశం ఉండడంతో ప‌రిశీల‌న బృందాల సంఖ్య‌ను పెంచుకోవాల‌ని చెప్పారు.

Also Read: Telangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌: రేవంత్‌ రెడ్డి

 

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులపై హైదరాబాద్‌లోని స‌చివాల‌యంలో సోమ‌వారం ప్రభుత్వం స‌మీక్ష నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డిజిట్ కార్డుల పైలెట్ ప్రాజెక్టు, సేక‌రించే వివ‌రాల‌ను అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. పైలెట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేప‌డ‌తార‌ని సీఎం ప్ర‌శ్నించారు. అక్టోబ‌రు 3 తేదీ నుంచి ఏడో తేదీ వ‌ర‌కు అయిదు రోజుల పాటు చేప‌డ‌తామ‌ని అధికారులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కుటుంబస‌భ్యులు మొత్తం స‌మ్మ‌తిస్తే కుటుంబం ఫొటో తీయాల‌ని.. కాకపోతే అది కేవలం ఐచ్ఛికం (ఆప్ష‌న‌ల్)గా ఉండాల‌ని సీఎం స్పష్టం చేశారు. కుటుంబం స‌మ్మ‌తి లేకుంటే ఆ ఫొటో తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చిచెప్పారు. 

క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌కు సంబంధించి ఉమ్మ‌డి జిల్లాల‌కు ఉన్న నోడ‌ల్ అధికారులు క‌లెక్ట‌ర్ల‌కు మార్గ‌నిర్దేశం చేయాల‌ని.. అప్పుడే ప‌క‌డ్బందీగా కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని ముఖ్య‌మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు.  ప్ర‌భుత్వం వ‌ద్దనున్న రేష‌న్ కార్డు, పింఛ‌న్‌-స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు భ‌రోసా, రుణ‌మాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ‌, కంటి వెలుగు త‌దిత‌ర డేటాల ఆధారంగా ఇప్ప‌టికే కుటుంబాల‌ గుర్తింపున‌కు సంబంధించిన ప్ర‌క్రియ పూర్త‌యింది. పైలెట్ ప్రాజెక్టులో దానిని నిర్ధారించుకోవ‌డంతో పాటు కొత్త స‌భ్యులను జ‌త చేయ‌డం, మృతి చెందిన వారిని తొల‌గించ‌డం చేస్తామ‌ని  అధికారులు ముఖ్యమంత్రికి వివ‌రించారు.

కుటుంబ స‌భ్యుల వివ‌రాల న‌మోదు, మార్పులుచేర్పుల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు. ఎలాంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. పైలెట్ ప్రాజెక్టుతో బ‌య‌ట‌కు వ‌చ్చిన సానుకూల‌త‌లు, ఎదురైన ఇబ్బందుల‌తో నివేదిక త‌యారు చేయాల‌ని రేవంత్ రెడ్డి సూచించారు. ఆ నివేదిక‌పై చ‌ర్చించి లోపాల‌ను ప‌రిహారించిన అనంత‌ర పూర్తి స్థాయి క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌ చేప‌డ‌దామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News