Issue on 10th Exams: తెలంగాణలో మరో రచ్చ.. టెన్త్ పరీక్షలు ముందుకు జరపాలని డిమాండ్!

తెలంగాణలో మరో రగడ మొదలైంది. ఇంటర్,టెన్త్ బోర్డుల తీరుపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. పరీక్షల నిర్వహణ ఎందుకు విమర్శలకు దారి తీస్తోంది..? ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఏం కోరుతున్నారు..? పరీక్షల బోర్డు ఏం చెబుతోంది..? 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 11:39 PM IST
  • పదో తరగతి పరీక్షల నిర్వహణపై సర్వత్రా విమర్శలు
  • మండుటెండల్లో పరీక్షలను ఎలా నిర్వహిస్తారని విమర్శలు
  • జేఈఈ కారణంగా పరీక్షల రీషెడ్యూల్‌
  • రీషెడ్యూల్‌పై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఫైర్
  • ఏప్రిల్ చివరి నాటికి పది పరీక్షలు పూర్తి చేయాలని డిమాండ్
Issue on 10th Exams: తెలంగాణలో మరో రచ్చ.. టెన్త్ పరీక్షలు ముందుకు జరపాలని డిమాండ్!

Issue on 10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండు టెండల్లో పరీక్షలను ఎలా నిర్వహిస్తారని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ మాత్రం ఆలోచించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. జేఈఈ పరీక్షల రీషెడ్యూల్‌తో తెలంగాణలో ఇంటర్, టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో మే 11 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించాలని బోర్డు భావించింది. జేఈఈ మెయిన్స్ కారణంగా 23 నుంచి నిర్వహిస్తున్నట్లు అధికారులు  రీషెడ్యూల్ చేశారు. ఈ పరీక్షలు జూన్ 1 వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దీనిపై యూటీఎఫ్‌, సీపీఎస్‌ఈయూ, టీఆర్డీఎఫ్‌, టీపీటీఎఫ్‌ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.  

ఈసారి 11 పేపర్లకు బదులు 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి అనుగుణంగా జనవరిలోపు సిలబస్ పూర్తి చేసి ఫిబ్రవరి నుంచి స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు.  ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో బోర్డు పునరాలోచించాలంటున్నారు.

ప్రభుత్వం,టెన్త్ బోర్డు తీరుపై ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు మండిపతున్నారు. వేసవిలో పరీక్షలు నిర్వహిస్తే.. తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉంటే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోందని అంటున్నారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ఏప్రిల్‌ చివరి నాటికి పూర్తి చేయాలంటున్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్నారు విద్యార్థి తల్లిదండ్రులు.

Also Read: Gold and Silver Rates Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర! నేటి పసిడి, వెండి రేట్లు ఇవే!!

Also Read: Harmanpreet Kaur: వావ్.. వాట్ ఏ క్యాచ్ హర్మన్‌ప్రీత్! బహుశా జాంటీ రోడ్స్ కూడా పట్టడేమో (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News