TS TET 2022: ఇవాళ తెలంగాణలో 'టెట్'.. రెండు సెషన్లలో జరగనున్న పరీక్ష..

Teacher Eligibility Test 2022: తెలంగాణలో ఇవాళ టెట్ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 6 లక్షల పైచిలుకు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 10:52 AM IST
  • తెలంగాణలోని 33 జిల్లాల్లో ఇవాళ టెట్ పరీక్ష
  • పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
  • హాజరుకానున్న 6 లక్షల పైచిలుకు అభ్యర్థులు
TS TET 2022: ఇవాళ తెలంగాణలో 'టెట్'.. రెండు సెషన్లలో జరగనున్న పరీక్ష..

Teacher Eligibility Test 2022: తెలంగాణలో ఇవాళ (జూన్ 12) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.ఉదయం 9.30 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గం. నుంచి సాయంత్రం 5 గం. వరకు పేపర్ 2 నిర్వహించనున్నారు. ఈసారి టెట్ పరీక్షకు దాదాపు 6,29,352 మంది హాజరుకానున్నారు. ఇందులో 3,51,468 మంది పేపర్ 1, 2,77,884 మంది పేపర్ 2 పరీక్ష రాయనున్నారు.

ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 1480 మంది చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. 29,513 మంది ఇన్విజిలేటర్లు, 13,415 మంది హాల్ సూపరింటెండెంట్స్ పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లను జిల్లా కలెక్టర్లు పరిశీలించారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో ఒక ఏఎన్ఎంతో పాటు ప్రథమ చికిత్సకు అవసరమయ్యే మందులను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

టెట్ అభ్యర్థులకు కీలక సూచనలు, జాగ్రత్తలు :

1) ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. 

2) అభ్యర్థులు గంట ముందు గానే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుంటే చివరి నిమిషంలో హడావుడి పడాల్సిన అవసరం ఉండదు.

3) అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు రెండు బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ తీసుకెళ్లాలి. మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరు.

4) ఓఎంఆర్ షీట్‌ను మలవడం, కొట్టివేతలు చేయడం వంటివి చేయవద్దు.

5) ఓఎంఆర్ షీట్‌లో బుక్‌లెట్ కోడ్‌ను షేడ్ చేయాలి. లేనిపక్షంలో పేపర్ వాల్యూయేషన్ జరగదు. 

Also Read: Srikantha Chary Father: తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి తండ్రి మిస్సింగ్..? పోలీసులకు శంకరమ్మ ఫిర్యాదు  

Also Read: CM KCR: కేసీఆర్ ఆ పని చేస్తే రేవంత్ రెడ్డికి గండమే..? తెలంగాణలో ఏం జరగబోతోంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News