Tollywood: తెలంగాణలో ఆన్‌లైన్ సినిమా టికెట్లు, టాలీవుడ్ ప్రతిపాదనలు

Tollywood: తెలుగు సినిమా బలోపేతానికి టాలీవుడ్ సిద్ధమౌతోంది. సినీ పరిశ్రమను పటిష్టం చేసేందుకు కొతక్త నిర్ణయాలు తీసుకోనుంది. కొత్తగా ఆన్‌లైన్ టికెట్ విధానం ప్రవేశపెట్టాలని తెలుగు సినీ పరిశ్రమ ఆలోచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2025, 01:49 PM IST
Tollywood: తెలంగాణలో ఆన్‌లైన్ సినిమా టికెట్లు, టాలీవుడ్ ప్రతిపాదనలు

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో కీలకమైన మార్పులు రానున్నాయి. పుష్ప 2 సినిమా విడుదల, అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమకు మధ్య దూరం పెరిగింది. ఈ దూరాన్ని తొలగించి తిరిగి సానుకూల వాతావరణం ఏర్పడే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని మార్పులు రావల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలకు అనుగుణంగా తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రదానంగా టికెటింగ్ విధానంలో మార్పు రావాలనే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పరిశ్రమలో ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. హైదరాబాద్‌లో సినిమా సిటీ ఏర్పాటుకై 1500 నుంచి 2 వేల ఎకరాల భూమి కేటాయించాలని తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు కోరారు. గత ప్రభుత్వం సినిమా సిటీ కోసం భూములు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి 24 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా భూములు కేటాయించాలని అడిగారు. 

తెలంగాణలో ఆన్‌లైన్ సినిమా టికెట్లు

మరోవైపు పెద్ద సినిమాల విడుదల సమయంలో బ్లాక్ టికెట్ల దందా జోరుగా కొనసాగుతోందని వివరించింది. బ్లాక్ టికెట్ల దందా నియంత్రించేందుకు ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ ప్రవేశపెట్టాలని టాలీవుడ్ ప్రతిపాదించింది. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం అన్ని ప్రాంతాల్లో అమలయ్యేలా దశలవారీగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సూచించింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల విషయంలో కూడా తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వమే ఒక డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ విధానం తీసుకురావాలని సూచించింది. 

Also read: Bank Holidays: 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News