పాలమూరుగడ్డపై కేటీఆర్ సెంటిమెంట్ అస్త్రం

             

Last Updated : Oct 29, 2018, 09:17 PM IST
పాలమూరుగడ్డపై కేటీఆర్ సెంటిమెంట్ అస్త్రం

మహబూబ్‌నగర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మత్కల్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీని అంశాన్ని ప్రస్తావిస్తూ ఇరువురిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు అడ్డుపడ్డ ఇరువురు నేతలు కలిసి ఈ ప్రాంతంలో మళ్లీ పాగా వేయాలని చూస్తున్నారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్న చంద్రబాబుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు కలపడం సిగ్గుచేటన్నారు...కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెడుతోందనడానికి ఇదే నిదర్శనమని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యహరించిన ఇక్కడ ఎలా పోటీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీకి చెందిన అభ్యర్ధి ఇక్కడ గెలిస్తే పాలన అంతా చంద్రబాబు కన్నుసన్నల్లోనే నడుస్తుందని.. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు అడ్డుకోవడం ఖాయమన్నారు. తెలంగాణ పచ్చదనంపై కత్తికట్టిన చంద్రబాబు,టీడీపీకి ఓటు వేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు.

కాంగ్రెస్ లో అందరూ సీఎంలే

మహాకూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియని పరిస్థితి అని కేటీఆర్ ఎద్దేవ చేశారు... ఒక్క పాలమూరు నుంచే ఐదుగురు ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఉన్నారు..తెలంగాణ కాంగ్రెస్ లో అందరూ సీఎం అభ్యర్ధులేనని.. రేవంత్ రెడ్డి..ఉత్తంకుమార్ రెడ్డి, జానారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎం అభ్యర్ధులేనని ఎద్దేవ చేశారు. పోరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూర్చీ కోసం కోట్లాట తప్పితే తెలంగాణ ప్రజలకు దక్కేది శూన్యమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారం కోసం.. సీఎం పీఠం కోసం పాకులాట తప్పితే కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం ఎలా పోరాడారో అందరికీ తెలిసిందేనని..టీఆర్ఎస్ కు ఓటు వేస్తే మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం బతికి ఉంటుందని ఈ సంద్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. 
 

Trending News