TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలు.. పరీక్షలు ఎప్పుడంటే..?

TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో భర్తీకి ఇటీవలె నోటిఫికేషన్లు విడుదల చేయగా.. అభ్యర్థుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 9,231 పోస్టులకు 2.63 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా పరీక్షల తేదీలపై బోర్డు కీలక ప్రకటన చేసింది.

Written by - Ashok Krindinti | Last Updated : Jun 18, 2023, 07:55 PM IST
TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలు.. పరీక్షలు ఎప్పుడంటే..?

Update on TS Gurukulam Notification 2023 : తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి సంబంధించి గురుకుల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లోనే గురుకుల పరీక్షలన్నీ నిర్వహిస్తామని వెల్లడించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ వరకు గురుకుల నియామక పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోట్‌ను విడుదల చేశారు. 9,210 పోస్టులకు మొత్తం 2.63 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇటీవలె ఎడిట్ ఆప్షన్ కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తుండగానే.. గురుకుల బోర్డు పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఇక అభ్యర్థులు ఎడిట్ చేసుకునేందుకు ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఫిజికల్ డైరెక్టర్, జూనియర్ లెక్చరర్, లైబ్రరీయన్, PGT పోస్టులకు జూన్ 14 నుంచి 19వ తేదీ మధ్య ఎడిట్ చేసుకోవచ్చు. డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ (స్కూల్స్), ఆర్ట్ టీచర్ పోస్టులకు జూన్ 20 నుంచి 24 తేదీ మధ్య ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులకు జూన్ 25-30 మధ్య ఎడిట్ చేసుకునేందుకు బోర్డు అవకాశం కల్పించింది.

Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు

9,231 పోస్టులకు గురుకుల నియామక బోర్డు తొమ్మిది నోటిఫికేషన్లను వేర్వేరుగా రిలీజ్ చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కన్వీనర్‌ డా.మల్లయ్య బట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. అదేవిధంగా అభ్యర్థులకు ఎడిట్ చేసుకునేందుకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఎడిట్ చేసి అప్లికేషన్లను ప్రింట్ లేదా పీడీఎఫ్ ఫైల్ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆయా తేదీలను గమనించి ఏమైనా పొరపాట్లు ఉంటే ఎడిట్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News