Telangana Grain Procurement: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రులు టి.హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎస్.నిరంజన్ రెడ్డిలు తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించకొని కొనుగోళ్లకు సిద్దం కావాలని ఆదేశించారు. రాష్ట్రంలో రైతుల పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, ఇందుకోసం 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని చెప్పారు. సోమవారం యాసంగి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ సేకరణపై ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లలు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, డీఎంలు, ఎఫ్‌సీఐ అధికారులతో సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో మంత్రులు ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్ధం చేసుకోవాలని.. వచ్చే వారంలో ధాన్యం కొనుగోల్లపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. యాసంగికి సీజన్ సీఎంఆర్‌ను ఈ నెల 30వ తేదీలోగా మిల్లర్లు నుంచి సేకరించాలని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇక నుంచి సీఎంఆర్‌ను అప్పగించే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ని అప్పగించి ఈ సీజన్ సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు. సీఎంఆర్‌లో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగస్వామ్యం చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశంలో ఆయా రాష్ట్రాలలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం అని మంత్రులు అన్నారు. రేపటి నుంచి అదనపు కలెక్టర్లు జిల్లాస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకోని ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లు గుర్తించి తగు ప్రతిపాధనలను ప్రభుత్వానికి సమర్పించాలని వారు సూచించారు.
Also Read: 7th Pay Commission: ఆ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గిఫ్ట్.. డీఏ 4 శాతం పెంపు
అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో రోజురోజుకు ధాన్యం దిగుబడి, కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయని 2014-15 లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020-21 నాటికి రూ.26 వేల 600 కోట్లకు చేరుకుందన్నారు. 9 సంవత్సరాలలో ఆరు రేట్ల ధాన్యం కొనుగోలు పెరగగా.. మిల్లింగ్ సామర్థ్యం రెండు రేట్ల మాత్రమే పెరిగిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని.. ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: PM Kisan Samman Yojana: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook