Telangana Group 2 Exam Rescheduled New Dates: గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థుల భారీ ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి నవంబరు నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. నవంబర్ 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. పరీక్షకు వారం రోజుల ముందు అభ్యర్థులకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ నెల 29, 30వ తేదీల్లో జరగాల్సిన ఉండగా.. వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు నేడు టీఎస్‌పీఎస్‌సీ కొత్త తేదీల వివరాలను ప్రకటించింది.
రాష్ట్రంలో గ్రూప్-2 నోటిఫికేషన్ కింద 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్షలు జరుగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటన తరువాత అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. గురుకుల సహా ఇతర పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు.. తమకు గ్రూప్-2కి రెడీ అయ్యేందుకు సమయం చాలలేదని ఆందోళన బాటపట్టారు.
గురువారం అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు. వారికి వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా గురించి ట్వీట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని లక్షల మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్‌పీఎస్‌సీతో సంప్రదించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారని వెల్లడించారు. భవిష్యతలో జరిగే పోటీ పరీక్షల నోటిఫికేషన్‌ల జారీలో ప్రణాళికాబద్ధంగా ఉండేలా చూడాలని సీఎం సూచించారని చెప్పారు. అర్హత ఉన్న అన్ని పరీక్షలకు అభ్యర్థులకు ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం లభిస్తుందని సీఎస్‌కు చెప్పారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Also Read: Bhola Shankar: భోళా శంకర్ పెద్ద రాడ్డు.. టీమిండియాదే వరల్డ్ కప్.. ఇదేక్కడి సెంటిమెంట్ మావా బ్రో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి