ఆర్టీసీ బస్సు బోల్తాపడి 30 మందికి గాయాలు!

బోల్తాపడిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు!

Last Updated : Oct 22, 2019, 08:05 AM IST
ఆర్టీసీ బస్సు బోల్తాపడి 30 మందికి గాయాలు!

యాదాద్రి-భువనగిరి బైపాస్ రోడ్డుపై సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారును ఢీకొన్న ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తోన్న ఈ బస్సు భువనగిరి చౌరస్తా వద్ద ప్రమాదం బారినపడింది. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బస్సును అతివేగంగా నడపడం వల్లే ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సుపై పట్టు కోల్పోయినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికుల్లో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆర్టీసీ సమ్మె చేపట్టినప్పటి నుంచి ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లతోనే బస్సులు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అనుభవం లేకపోవడం ఒకవైపు, నైపుణ్యం లేకపోవడం మరోవైపు... వెరసి నిత్యం ఆర్టీసీ బస్సులు ఏదో ఓ చోట ప్రమాదాలబారిన పడుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Trending News