tsrtc profit tsrtc gets record income for sankranthi festival Rs 107 crore revenue earned : టీఎస్ఆర్‌టీసీకి (tsrtc) సంక్రాంతి పండుగ సందర్భంగా రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation) సంక్రాంతి (sankranthi) నేపథ్యంలో ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపింది. సాధారణ షెడ్యూల్ బస్సులకు అదనంగా 4 వేలకు పైగా అదనపు బస్సులను (More than 4 thousand extra buses) నడిపించింది టీఎస్ ఆర్‌టీసీ.
సంక్రాంతి సందర్భంగా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను (55 lakh passengers) గమ్యస్థానాలకు చేర్చినట్లు టీఎస్ ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. పండుగ సీజన్‌లో టీఎస్ఆర్‌టీసీకి (tsrtc) రూ.107 కోట్ల ఆదాయం (Rs 107 crore revenue) సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read : Punjab Elections 2022: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా 'భగవంత్ మాన్'..
కోవిడ్‌కు ముందు రోజూ ఆర్టీసీకీ రూ.12 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని, అయితే సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు రూ.15.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక టీఎస్ఆర్‌టీసీని ఇంతగా ఆదరిస్తోన్న ప్రయాణికులకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా టీఎస్ఆర్టీసీని (tsrtc) ఆదరిస్తూ.. సంస్థ అభివృద్ధికి తోడ్పాడు అందించాలని ప్రయాణికులను కోరారు.
Also Read : Telangana covid updates : తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతి, రోజురోజుకు పెరుగుతోన్న కోవిడ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook