Brutal Murder: సెల్‌ఫోన్ రేపిన చిచ్చు... యువకుడి దారుణంగా హత్య చేసిన స్నేహితులు..

Murder over Cell Phone: ఆ ముగ్గురు మంచి స్నేహితులు. సెల్‌ఫోన్ కారణంగా వారి మధ్య చిచ్చు రేగింది. దీంతో ఇద్దరు స్నేహితులు కలిసి మరో స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. వికారాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 05:40 PM IST
  • వికారాబాద్‌లో యువకుడి దారుణ హత్య
  • స్నేహితులే హత్య చేసిన వైనం
  • సెల్‌ఫోన్ రేపిన చిచ్చుతో హత్య
Brutal Murder: సెల్‌ఫోన్ రేపిన చిచ్చు... యువకుడి దారుణంగా హత్య చేసిన స్నేహితులు..

Murder over Cell Phone: వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. స్నేహితుల మధ్య సెల్‌ఫోన్ రేపిన చిచ్చు ఒకరి హత్యకు దారితీసింది. ఇద్దరు స్నేహితులు కలిసి మరో స్నేహితుడిని అత్యంత కిరాతకంగా తలపై బండరాయితో మోది హత్య చేశారు. హత్యానంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ప్రశాంత్, అంతారంకు చెందిన జస్వంత్, మల్‌రెడ్డిపల్లికి చెందిన రాజు స్నేహితులు. ఇటీవల ఓరోజు ప్రశాంత్.. జస్వంత్, రాజుల వద్దకు వెళ్లి తనకు డబ్బులు అవసరం ఉందని చెప్పాడు. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఇద్దరు మిత్రులకు ఇచ్చి.. దాన్ని అమ్మి పెట్టమని కోరాడు. దీంతో జస్వంత్, రాజు ఆ సెల్‌ఫోన్‌ని తీసుకుని తాండూరులోని ఓ షాపుకు వెళ్లారు.

ఆ సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్‌కి ఎంత ధర పలుకుతుందో చెప్పాలని షాపు యజమానిని కోరారు. ఆ సెల్‌ఫోన్‌ను పరిశీలించిన షాపు యజమాని.. అది దొంగిలించిన ఫోన్ అని వారిపై కోప్పడ్డాడు. దొంగతనం చేసి తీసుకొచ్చిన ఫోన్‌ను నాకే అంటగట్టాలని చూస్తారా అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో భయపడ్డ రాజు, జస్వంత్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దొంగిలించిన ఫోన్‌ను ప్రశాంత్ తమకు అంటగట్టాడని అతనిపై ఆగ్రహంతో రగిలిపోయారు. మాట్లాడుదామని చెప్పి ప్రశాంత్‌ను పిలిపించారు.

పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారుకు తీసుకెళ్లి.. అక్కడ ప్రశాంత్‌పై ఇద్దరు కలిసి దాడికి పాల్పడ్డారు. బండరాయితో అతని తలపై మోది హత్య చేశారు. హత్యానంతరం అక్కడి నుంచి నేరుగా తాండూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ప్రశాంత్‌ను తామే చంపినట్లు అంగీకరించారు. నిందితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి ఆరోపిస్తున్నారు.

Also Read: UP Election Results: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జోరు... కాషాయ పార్టీ గెలుపుకు దోహదం చేసిన అంశాలివే..

Also Read: Radhe Shyam: తెలంగాణ సర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News