Munugode Byelection: తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన నల్గొండ జిల్లా మునుగోడులో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు వేస్తోంది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణ పురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. పీసీసీ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి మునుగోడు పర్యటనకు ముందు సంచలన ఘటనలు జరిగాయి.
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంతో పాటు సంస్థాన్ నారాయణపురంలో రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్లు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనూ ఈ పోస్టర్లు వెలిశాయి. మునుగోడు నిన్ను క్షమించదు అంటూ పోస్టర్లలో రాశారు. 22 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహి అని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాను కలిసి బేరమాడిన నీచుడివంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు మునుగోడు నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న రోజే పోస్టర్లు వెలువడం.. పోస్టర్ లో సోనియా పేరు ప్రస్తావించడంతో కాంగ్రెస్ వాళ్లు వీటిని అతికించారనే ఆరోపణలు బీజేపీ నేతలు చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు రావడంతో.. రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకునేందుకు కమలం పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీంతో మునుగోడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook