Ys Sharmila new party: వైఎస్ షర్మిల కొత్త పార్టీకు సలహాదారుల నియామకం, ఎవరో తెలుసా

Ys Sharmila new party: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి షర్మిల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. 

Last Updated : Feb 17, 2021, 04:55 PM IST
  • వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీపై జోరందుకున్న ఏర్పాట్లు
  • పార్టీ సలహాదారులుగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయ కుమార్ సిన్హాలు నియామకం
  • మే 14 లేదా జూలై 8న పార్టీ పై ప్రకటనకు అవకాశం
Ys Sharmila new party: వైఎస్ షర్మిల కొత్త పార్టీకు సలహాదారుల నియామకం, ఎవరో తెలుసా

Ys Sharmila new party: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి షర్మిల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. 

హైదరాబాద్ లోటస్ పాండ్ ( Lotus pond ) సాక్షిగా వైఎస్ షర్మిల ( Ys Sharmila )ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ ( Telangana )రాజకీయాల్లో కలకలం రేపింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరిగా వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించి సంచలనం రేపారు. త్వరలో కొత్త పార్టీ ప్రకటన రానుంది. కొత్త పార్టీ ఏర్పాటు ఎప్పుడనే విషయంపై ఇప్పటికే రెండు తేదీలు  పరిశీలనలో ఉన్నాయి. వైఎస్ఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మే 14 గానీ, వైఎస్ఆర్ జయంతి అయిన జూలై 8 న గానీ వైఎస్  షర్మిల కొత్త రాజకీయ పార్టీ ( Ys sharmila new political party )ని ప్రకటించనున్నారు. 

వైఎస్ షర్మిల ( Ys Sharmila )ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీకు సంబంధించి ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని జిల్లాల్లో నేతలు, అభిమానులతో ఆమె సమావేశమవుతున్నారు. కొత్త పార్టీ విధి విధానాలపై చర్చించేందుకు షర్మిల అండ్ టీమ్ కసరత్తు చేస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు విషయమై సలహాదారుల్ని( Ys sharmila appointed advisors ) నియమించుకున్నట్టు సమాచారం. రాజకీయ పార్టీ సలహాదారులుగా మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయ కుమార్ సింహాలను నియమించినట్టు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( Ys rajasekhar reddy )ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభాకర్ రెడ్డి, ఉదయ కుమార్ సింహాలు సీఎంవోలో పనిచేశారు. రాజకీయ సలహాదారుల నియామకంతో పార్టీ పట్ల ఆమె సీరియస్‌గానే ఉన్నట్టు అర్ధమౌతోంది.

Also read: Happy Birthday KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి 10 ఆసక్తికర విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News