YS Sharmila Padayatra: వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3 వేల కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఅర్ పై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఒక మోసగాడు.. ఒక 420 అని ఆరోపించిన వైఎస్ షర్మిల.. కేసీఆర్ చేసిన దగాకు ఆయన్ను 420 అనకపోతే ఏమని పిలుస్తారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుక్కున్న కేసీఆర్.. ఇప్పుడు తన నుంచి బీజేపి కొనుక్కుంటే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నా పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేసుకుంటుంది అని దండాలు పెడుతున్నారు. మొకరించి నన్ను.. నా పార్టీని కాపాడండి అని చేతులు జోడించి వేడుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ గురించి కేసీఆర్ నిజాలు మాట్లాడుతున్నందుకు సంతోషం. కానీ మునుగోడులో ఒక్కో ఓటుకు వేలు పెట్టి కొని చేసిందేమీటని ప్రశ్నించారు. ఒక్కో సర్పంచ్‌కి ఇంత, ఎంపీటీసీకి ఇంత ,ZPTC కి ఇంత అని కోట్లు ఇచ్చి కొన్నారు కదా.. అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అనరా అని ప్రశ్నించారు. కేసీఅర్ మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి ఖూనీ చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొని తన పార్టీలో కలుపుకున్నప్పుడు ప్రజా స్వామ్యం ఖూనీ చేసినట్లు కాలేదా ? అప్పుడు కనిపించలేదా ప్రజాస్వామ్యం ? అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొంటె తప్పు లేదు కానీ.. ఇప్పుడు ఈయన పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తే తప్పా అని ప్రశ్నించారు. ఈయన చేస్తే ఒప్పు అయిన పని బీజేపీ చేస్తే తప్పయిందా అని ప్రశ్నించారు. ఈయన చేస్తే సంసారం.. పక్కనోడు చేస్తే వ్యభిచారమా అని ఎద్దేవా చేశారు. దెయ్యాలు, వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో కేసీఅర్ వేదాలు మాట్లాడితే అంత కన్నా అసహ్యంగా ఉందని సీఎం కేసీఆర్ కు చురకలంటించారు.
ప్రజాప్రస్థానం పాదయాత్రలో 3 వేల కిమీ నడిచింది నేనే అయినా... నడిపించింది మీ అభిమానమే అని చెప్పి వైఎస్ఆర్టీపీ కార్యకర్తల ఆదరాభిమానాలను చూరగొనే ప్రయత్నం చేశారు. నల్లా తిప్పితే నీళ్ళ కన్నా లిక్కరే ఎక్కువగా వస్తోంది కదా అని రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని కేసీఆర్‌కు ( KCR ) వైఎస్ షర్మిల పరోక్షంగా చురకలంటించారు.
Also Read : Munugode Bypoll: మునుగోడులో ఈవీఎంల రీప్లేస్? అధికార పార్టీ కుట్రలు చేస్తోందా?
Also Read : CM KCR Videos: జబర్దస్త్ కామెడీ షో.. సీఎం కేసీఆర్ వీడియోలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ కౌంటర్
Also Read : Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సస్పెండ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Sharmila : వైఎస్ షర్మిల పాదయాత్రలో కీలక మైలురాయి.. కేసీఆర్‌కి చురకలే చురకలు
వైఎస్ షర్మిల పాదయాత్రలో కీలక మైలురాయి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుక్కున్న కేసీఆర్
ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఎలా నిలదీస్తారు