YS Sharmila: కాంగ్రెస్‌కు ట్విస్ట్ ఇచ్చిన వైఎస్ షర్మిల.. ఆ రోజే డెడ్‌లైన్

YSRTP Congress Merger: కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్ విధించారు వైఎస్ షర్మిల. ఈ నెల 30వ తేదీలోపు విలీనంపై నిర్ణయం తీసుకోకపోతే.. 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడిపోయింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 26, 2023, 12:21 AM IST
YS Sharmila: కాంగ్రెస్‌కు ట్విస్ట్ ఇచ్చిన వైఎస్ షర్మిల.. ఆ రోజే డెడ్‌లైన్

YSRTP Congress Merger: కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం ఖాయమని అనుకుంటున్న దశలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విస్ట్ ఇచ్చారు. లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించిన షర్మిల.. విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున  ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై ప్రధాన చర్చించారు. ఈ నెల 30లోపు విలీనంపై  నిర్ణయం తీసుకుంటామని చెప్పారు షర్మిల. విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో YSRTP పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి  ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని షర్మిల తెలిపారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ  ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. 

షర్మిల వ్యాఖ్యలతో కాంగ్రెస్‌తో పొత్తు విషయం ఇంకా క్లారిటీ రాలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి షర్మిల.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పార్టీ విలీనంపై కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. రేపో.. మాపో విలీన ప్రకటన అధికారింగా రాబోతుందనే తరుణంలో షర్మిల కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. 

అయితే షర్మిల రాకను కాంగ్రెస్‌లోని ఓ వర్గం వ్యతిరేకిస్తోందని ప్రచారం జరుగుతోంది. అందుకే విలీన ప్రకటన ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. కొంతమంది పెద్దలు ఆహ్వానిస్తుండగా.. మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. అందుకే ఇంకా విలీనంపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. షర్మిలను రాకను వ్యతిరేకిస్తున్న వాళ్లే.. అడ్డంకులు సృష్టిస్తున్నారని చర్చించుకుంటున్నారు. కానీ.. అధిష్టానం ఒకే చెప్పిన తరువాత అడ్డు ఏం ఉంటుందని మరికొందరు అంటున్నారు.

119 స్థానాల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తే.. పెద్దగా ప్రయోజనం లేకపోయినా ప్రజా వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకులో కొంత షర్మిలకు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్న స్థానాల్లో షర్మిల ఎంట్రీ ఇస్తే.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపనుంది. పార్టీని విలీనం చేస్తే.. తనకు కావాల్సిన సీట్లలో తమ పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకోవాలని షర్మిల చూస్తున్నారు. ఈ నెల 30 తరువాత ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి మరి.

Also Read: Suryakumar Yadav: ఇదేం బాదుడు సూర్య భాయ్.. వరుసగా నాలుగు సిక్సర్లతో ఆ బౌలర్‌కు చుక్కలు  

Also Read: Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ లాంచ్, ఇంటర్నెట్ స్పీడ్, ఫ్రీ ఓటీటీ ఇతర ప్లాన్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News