YS Sharmila: సిగ్గుందా ముఖ్యమంత్రి గారు..? ప్రజల రక్తం తాగడం చాలలేదా..?: వైఎస్ షర్మిల

Crop Loan Waiver Scheme in Telangana: రాష్ట్రంలో నిధుల కొరత లేదని ఇన్నాళ్లు గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్.. రుణ మాఫీ చేయడానికి మాత్రం కరోనా అడ్డు వచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 3, 2023, 05:32 PM IST
YS Sharmila: సిగ్గుందా ముఖ్యమంత్రి గారు..? ప్రజల రక్తం తాగడం చాలలేదా..?: వైఎస్ షర్మిల

Crop Loan Waiver Scheme in Telangana: రుణమాఫీపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత హామీలు నెరవేరిస్తే.. దొర గారికి మాత్రం ఎన్నికల ముందే హామీలు గుర్తుకువస్తాయంటూ కౌంటర్ ఇచ్చారు. నాలుగేళ్లు గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోయిన ముఖ్యమంత్రి.. ఓట్ల కోసం అటక మీద దాచిన మేనిఫెస్టో తిరగేస్తున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ రైతులను ఓట్లు అడిగే ముఖం లేక.. రుణమాఫీ చేస్తానని నక్క వినయం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ అమలు చేసేందుకు కేసీఆర్ చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి అని ఆమె అన్నారు.

బీఆర్ఎస్ బంధిపోట్లకు నాలుగున్నరేళ్లుగా తెలంగాణ సొమ్మంతా దోచుకోవడం, దాచుకోవడానికే సరిపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఇక మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అన్నారు. అందుకే రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్ నెలలో చేయాల్సిన మద్యం టెండర్లను మూన్నెళ్ల ముందే ముంగటేసుకున్నాడని ఆరోపించారు. జనాలకు మద్యం తాగించి.. వచ్చిన సొమ్ముతో రుణమాఫీ చేస్తాడట అని అన్నారు. 

"సిగ్గుందా ముఖ్యమంత్రి గారు..? రేట్లు పెంచి, ట్యాక్స్ పెంచి ప్రజల రక్తం తాగడం చాలదని.. మద్యం తాగించి, మహిళల మంగళసూత్రాలు తెంపి, జనాలను మద్యానికి బానిస చేసి ఓట్లు దండుకోవడమా..? కరోనా సమయంలోనూ రాష్ట్రం ఆర్థికంగా దూసుకెళ్లిందని, నిధుల కొరత లేదని ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన దొర.. ఇప్పుడు రుణమాఫీ చేయడానికి కరోనా అడ్డు తగిలిందట..! ఇది చాలదన్నట్లు ఔటర్ రింగ్ రోడ్డును అగ్గువల 7 వేల కోట్లకే లీజుకిచ్చుకున్నారు.." అని షర్మిల అన్నారు

ప్రభుత్వ భూములను యథేచ్చగా అమ్ముకుంటున్నారని.. పకడ్బందీగా ఎన్నికల కోసం డబ్బును పోగు చేసుకుంటున్నాని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఏం చేసినా.. ఎన్నికల కోసమే చేస్తడు అనే మాట నిలబెట్టుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. "నీ పిట్టల దొర ముచ్చట్లను నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మరు. ఓట్ల కోసమైనా ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుంటున్న దొర గారు.. అదే చేతితో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వండి, నిరుద్యోగ భృతి ఇవ్వండి, వరద బాధితులను ఆదుకోండి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి, చట్ట సభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి, ఆగిపోయిన దళిత బంధును,మైనార్టీ బంధును అమలు చేయండి.. బీసీల్లోని అన్ని కులాలకు బీసీ బంధు ఇవ్వండి. ఎన్నికలకు ముందే రెండు దఫాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి, మీరు పిట్టల దొర కాదని నిరూపించుకోండి.." అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు డిమాండ్ చేశారు.

Also Read: Janjatiya Vikas: జీ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 5న 'జనజాతీయ వికాస్'.. వేడుకల్లో భారీగా పాల్గొనండి  

Also Read: Tomato Price Today: టమాట ధరలకు మరింత రెక్కలు.. కేజీ ట్రిబుల్ సెంచరీ దిశగా..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News