YS Sharmila: నాకు అన్ని పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయి.. విలీనంపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్

YS Sharmila on TSPSC: వైఎస్సార్టీపీ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. తాను చేరతానంటే ఏ పార్టీ అయినా వద్దని చెబుతుందా..? అని అన్నారు. విలీనం చేయాలని ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతానని ప్రశ్నించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : May 16, 2023, 02:14 PM IST
YS Sharmila: నాకు అన్ని పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయి.. విలీనంపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్

YS Sharmila on TSPSC: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మరోసారి పేపర్ లీక్ కాదంటూ తామే కేసీఆర్ కోసం ఒక అఫిడవిట్ తయారు చేశామని.. దీన్ని కేసీఆర్‌కు పంపుతున్నామని చెప్పారు. ఈ డిక్లరేషన్ చదువుకొని కేసీఆర్ సంతకం పెట్టాలని అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ తెలంగాణకే సిగ్గు చేటు అని.. పేపర్ లీక్ లక్షల మంది ఆశలను అడి ఆశలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ శాఖ వైఫల్యంతోనే పేపర్ లీకేజీ జరిగిందని ఆరోపించారు. 

పేపర్ లీక్‌కు ఐటీ శాఖనే అవకాశం కల్పించిందని.. పేపర్ లీక్‌ను ప్రతిపక్షాల మీద తోస్తున్నారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఏ పార్టీ పేపర్ లీకేజీ చేసింది చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అదే సిబ్బందితో టీఎస్‌పీఎస్‌సీ బోర్డ్ తిరిగి పరీక్షలు పెడుతున్నారని.. మళ్లీ పేపర్ లీక్ కాదన్న గ్యారంటీ ఏంటి..? అని అడిగారు. పేపర్ లీక్ కాదన్న గ్యారంటీని కేసీఆర్ ఇవ్వాలన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల స్పందించారు. 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన సీట్లను నిలబెట్టుకోలేదని.. ఇది లీడర్‌షిప్ వైఫల్యం కాదా..? అని అన్నారు. నాయకత్వ లోపంతోనే కాంగ్రెస్ నేతలను నిలబెట్టుకోలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు లీడర్‌షిప్ లేకనే పక్క పార్టీ నుంచి లీడర్లను తీసుకువస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అనుకుంటే పార్టీ ఎందుకు పెడతా..? అని ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో అయినా చేరతానంటే ఎవరైనా వద్దంటారా..? అని అన్నారు. కర్ణాటకలో కష్టపడి పని చేసే డీకే శివ కుమార్ ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చిందన్నారు. 

'డీకే శివ కుమార్ లేకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మత, కుట్ర రాజకీయాలకు చెంప పెట్టు. ఎన్నికల ఏడాది కాబట్టి అన్ని పార్టీలు వారి ప్రయత్నాలు వాళ్లు చేస్తారు. నాకు అన్ని పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. ప్రస్తుతం మేం ఇంకా ఛార్జింగ్ మోడ్‌లో ఉన్నాం. ఎన్నికల సమయంలో అన్ని బయటకు వస్తాయి..' అని వైఎస్ షర్మిల అన్నారు.

Also Read: LSG Vs MI Dream11 Team Prediction: ముంబై జోరుకు లక్నో బ్రేకులు వేస్తుందా..? ప్లే ఆఫ్స్ చేరేది ఎవరు..? డ్రీమ్ 11 టీమ్ ఇలా..  

Also Read: CM Jagan Mohan Reddy: హోల్‌సేల్‌గా అమ్ముకునే వ్యక్తి ప్యాకేజీ స్టార్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఓ లెవల్లో ఉంది: సీఎం జగన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News