YS Sharmila: చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి..?: వైఎస్ షర్మిల

YS Sharmila Counter to MLC Kavitha: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనలో మహిళలకు సీట్ల కేటాయింపుపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను టార్గెట్‌ చేస్తూ కామెంట్స్ చేశారు. మీ చిత్తశుద్ధి ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 22, 2023, 06:45 PM IST
YS Sharmila: చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి..?: వైఎస్ షర్మిల

YS Sharmila Counter to MLC Kavitha: 33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి..? అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా..? అని నిలదీశారు. ఆకాశం, అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లా..? అని అడిగారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన విషయం సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన జాబితాలో ఏడుగురు మహిళలకు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవితను టార్గెట్ చేస్తూ.. ఇప్పటికే కాంగ్రెసక, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా వైఎస్ షర్మిల కూడా కవితపై ఫైర్ అయ్యారు. "కవితమ్మ 'Be the change you want to see'. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలి. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నా క్యాబినెట్‌లోనూ ప్రాధాన్యత దక్కలే. లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి క్యాబినెట్‌లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించు. 

లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పైన స్పందించిన పాపాన పోలేదు.. రాజధాని నడిబొడ్డున ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నా, మీ పోలీసులు మహిళా రైతులకు బేడీలు వేసినా, స్టేషన్‌లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా మీకు పట్టదు.. మీ దృష్టిలో మహిళలు వ్రతాలు చేసుకోవడానికి, ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తారు కానీ రాజకీయాలకు కాదు.. నిజంగా మీకు మహిళా రిజర్వేషన్లపై  గౌరవం ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం అమలు చేయించాలి. సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవితమ్మ. చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.." అని వైఎస్ షర్మిల అన్నారు.

Also Read: Minister Harish Rao: అభ్యర్థుల ప్రకటన తర్వాత కేసీఆర్ మొదటి సభ.. మెదక్‌లో ప్రగతి శంఖారావం: మంత్రి హరీశ్ రావు  

Also Read: TS Politics: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు జంప్.. పార్టీ మారనున్న నేతలు వీళ్లే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News