Live Reporting: లైవ్‌లో ఢీ కొట్టిన కారు, అయినా ఆగని లైవ్ రిపోర్టింగ్, వీడియో వైరల్

Live Reporting: లైవ్ రిపోర్టింగ్ అనేది కేక్ లేదా చాక్లెట్ తిన్నంత సులభం కాదు. చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా..కెమేరా ముందు మాత్రం మౌనంగా ఉండాల్సిందే.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 23, 2022, 02:06 PM IST
Live Reporting: లైవ్‌లో ఢీ కొట్టిన కారు, అయినా ఆగని లైవ్ రిపోర్టింగ్, వీడియో వైరల్

Live Reporting: లైవ్ రిపోర్టింగ్ అనేది కేక్ లేదా చాక్లెట్ తిన్నంత సులభం కాదు. చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా..కెమేరా ముందు మాత్రం మౌనంగా ఉండాల్సిందే.

అదే జరిగింది వెస్ట్ వర్జీనియా టెలివిజన్ న్యూస్ రిపోర్టర్ విషయంలో. లైవ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ జర్నలిస్టు ఘటన కెమేరాలో పూర్తిగా రికార్డైంది. ఇప్పుడా వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెస్ట్ వర్డీనియా టీవీ రిపోర్టర్ లైవ్ ఇస్తుండగా ఓ కారు బలంగా ఢీ కొట్టింది. అయినా లైవ్ మాత్రం (Live Reporting) ఆపలేదు ఆ రిపోర్టర్. 

ఈ వీడియోలో ఉన్న మహిళా రిపోర్టర్ పేరు టోరి యోర్గీ (Tory Yorgey). ఓ ఎస్‌యూవీ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. దాంతో ఆమె పడిపోయినా..తిరిగి లేచి మరీ లైవ్ కొనసాగించింది. ఇవ్వాల్సిన లైవ్ అంతా పూర్తి చేసింది. ఇది చూస్తున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ కారు ఢీ కొట్టిన కాస్సేపటికి..అంటే కొద్ది సెకన్లలో ఆ మహిళా రిపోర్టర్ లేచి నిలబడింది. ఓహ్ గాడ్..ఇప్పుడు కారు గుద్దేసింది. కానీ నేను బాగానే ఉన్నాను..టీమ్..నేను బాగానే ఉన్నాను అంటూ టీవీ యాంకర్ కు రిప్లై ఇచ్చింది. 

ఇదే వీడియోలో  ఏమీ కాలేదు కదా..అంటూ ఓ మహిళ వాయిస్ విన్పించింది. బహుశా ఈ వాయిస్.. గుద్దిన కారు డ్రైవింగ్ చేస్తున్న మహిళది కావచ్చు. ఇది మొత్తం ప్రత్యక్ష ప్రసారమవుతోంది. అంతా బాగానే ఉంది. కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా ఓసారి ఇలాగే జరిగింది అంటూ మహిళా రిపోర్టర్ (Lady Reporter) సంభాషణ కొనసాగించింది. కారు గుద్దినప్పుడు నువ్వు కింద పడిపోయావా..అసలేం జరిగింది..ఎందుకంటే స్క్రీన్‌పై ఒక్కసారిగా నువు మాకు కన్పించలేదు అంటూ యాంకర్ ప్రశ్నించగా. నాక్కూడా తెలియదు..ఏం జరిగిందో..నా లైఫ్ ఒక్కసారిగా నా కళ్ల ముందు కన్పించిందంటూ మహిళా రిపోర్టర్ సమాధానమిచ్చింది.

ఈ ప్రమాదం జరిగిన తరువాత టోరీ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లింది. టోరీ యోర్గీకు వృత్తిపై ఉన్న అంకితభావానికి నెటిజన్లు ప్రశంసలు కురిపించడం ప్రారంభించారు. గురువారం పోస్ట్ చేసిన ఈ వీడియో అప్పుడే 4 మిలియన్ల వరకూ వ్యూస్ సంపాదించింది. 30 వేల వరకూ లైక్స్ సాధించింది. 

Also read: Jacinda Ardern: ఒమిక్రాన్ ఎఫెక్ట్... ఏకంగా పెళ్లి రద్దు చేసుకున్న ఆ దేశ ప్రధాని...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News