ఒట్టావా : గత కొంతకాలంగా చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇప్పటికే చైనాలోని వుహాన్ నగరంలో దాపుగా 1000 కరోనా వైరస్ కేసులు నమోదయ్యుంటాయని తెలిపింది. కెనడాలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కేసు తొలిసారి వెలుగు చూడగా, అమెరికాలో ఈ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన మూడో కేసు అధికారికంగా నమోదయినట్లు తెలిపాయి.
కెనడాలోని ఒంటారియో నగరంలో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ అనుమానిత కేసు నమోదయినట్లు ప్రావిన్స్ అసోసియేట్ ప్రధాన వైద్యాధికారి డా.బార్బరా యాఫె చెప్పారు. 50 ఏళ్ల వయస్కుడైన ఈ పేషెంట్ చైనాలోని వుహాన్ నగరం నుండి కెనడాకు తిరిగి వచ్చాడని ఆయన వివరించారు. శనివారం ఆయన మాంట్రియల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టరంటోలో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ కేసు అధికారికంగా నమోదయిందని చెప్పారు. కెనడాలో ఇది తొలి కేసు అని ఆయన వివరించారు.
చలి తీవ్రత అధికమవుతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విచ్చలవిడిగా ప్రబలడం ఆందోళన కలిగించే విషయమని వైద్య నిపుణులు తెలిపారు. అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆరెంజ్ కౌంటీలో ఓ వ్యక్తికి కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి వుహాన్ చైనాలోని వుహాన్ నగరం నుండి తిరిగి వచ్చాడని, ఇతడికి ఆరోగ్య పరీక్ష నిర్వహించినపుడు వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వివరించారు.
ఈ క్రమంలో చైనా నుండి వచ్చే, ప్రత్యేకంగా వుహాన్ నగరం నుండి వచ్చే ప్రయాణికుల ఆరోగ్యపరిస్థితిని, ఏ రకమైన ఇన్ఫెక్షన్లకు గురైన, ఒకవేళ వైరస్ సోకినట్లు వెల్లడైతే వెంటనే అదుపులోకి తీసుకొని, వైరస్ ప్రబలకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..