America Hurricane: అమెరికాలో ఇయన్ హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో సర్వం కొట్టుకుపోతోంది. వీధుల్లో షార్క్‌లు కొట్టుకొస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు..
#Video | Catastrophic footage of hurricane Ian in Florida, USA! #IanHurricane #Ian #FloridaStorm #HurricaneIan #Storm #Watch #ViralVideo #NCIBNewsNetwork #Florida #Ian2022 #Ianflorida pic.twitter.com/b5eNfjY3cO
— NCIB NEWS NETWORK (@NCIB_INDIA_NEWS) September 29, 2022
ఇయన్ హరికేన్ ప్రతాపానికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం అల్లకల్లోలమైంది. సముద్రం నగరంలో చొచ్చుకొచ్చినట్టైంది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో భారీ వృక్షాలు, విద్యుత్ స్థంభాలు నేలకొరుగుతున్నాయి. సెల్ టవర్లు పనిచేయడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
😥#Ianflorida pic.twitter.com/ccDcKKruyV
— Elisabeth M G Halle (@ElisabethMGHal1) September 30, 2022
ఏకధాటిగా కురుస్తు అతి భారీ వర్షాలతో ఇళ్లు నీట మునిగాయి. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఊర్లోకి దూసుకొస్తున్నాయి. రోడ్లపైకి షార్క్‌లు కొట్టుకొస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
#Shockingmoment house floats away in Naples during #HurricaneIan #IanHurricane #Ianflorida pic.twitter.com/itIsTa37Iu
— 6IX WORLD NEWS (@6ixworldnews) September 29, 2022
అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన హరికేన్ ఇదేనని నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. టాంపా, ఒర్లాండో విమానాశ్రయాల్లో విమాన రాకపోకల్ని నిలిపివేశారు. మృతుల సంఖ్య వందల సంఖ్యలో ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.
People risk their lives swimming in Fort Myers during #hurricaneian #HurricanIan #Ianflorida pic.twitter.com/Trb2OpUfQS
— 6IX WORLD NEWS (@6ixworldnews) September 28, 2022
Also read: Kabul Suicide Attack: కాబూల్ పరీక్షాకేంద్రంలో ఆత్మాహుతి దాడి, వందకు పైగా విద్యార్ధుల మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook