Russia and Ukraine Representatives Fighting: 14 నెలలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం జరుగుతున్న విషయం అందరికి తెల్సిందే. ఉక్రెయిన్ ని ఆధీనంలోకి తీసుకునేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తూ ఉండగా.. దేశం మొత్తం నాశనం అయినా పర్వాలేదు కానీ తమ దేశాన్ని మాత్రం రష్యా ఆధీనంలోకి వెళ్లనిచ్చేది లేదు అన్నట్లుగా ఉక్రెయిన్ సైన్యం మరియు ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్దం కారణంగా ప్రభావం పడుతోంది. పలు దేశాల వారు ఈ యుద్దంను ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా సాధ్యం కావడం లేదు. ఈ యుద్ద ప్రభావం ఏ స్థాయికి చేరిందో తాజాగా అంతర్జాతీయ స్థాయి సమావేశం అయిన బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ లో జరిగిన సంఘట ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది.
టర్కీ రాజధాని అంకారా లో బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు దేశాల ప్రతినిధులు మరియు అంతర్జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. పలు దేశాల ప్రతినిధులు మరియు మీడియా పెద్ద ఎత్తున ఉండగానే రష్యాకు చెందిన ప్రతినిధి ఒకరు ఉక్రెయిన్ ఎంపీ ప్రదర్శిస్తున్న జాతీయ జెండాను లాక్కెల్లాడు.
🥊 In Ankara 🇹🇷, during the events of the Parliamentary Assembly of the Black Sea Economic Community, the representative of Russia 🇷🇺 tore the flag of Ukraine 🇺🇦 from the hands of a 🇺🇦 Member of Parliament.
The 🇺🇦 MP then punched the Russian in the face. pic.twitter.com/zUM8oK4IyN
— Jason Jay Smart (@officejjsmart) May 4, 2023
దాంతో ఉక్రెయిన్ ఎంపీ తమ జాతీయ జెండాను లాక్కెల్లడంతో రష్యా ప్రతినిధిని వెంబడించి దాడి చేశాడు. అతడి చేతిలో ఉన్న ఉక్రెయిన్ జెండాను లాక్కున్న ఎంపీ సదరు రష్యా ప్రతినిధిపై దాడికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న వారు ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
Also Read: YSR Kalyanamasthu: లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ.. రూ.87.32 కోట్ల ఆర్థిక సహాయం: సీఎం జగన్
ఇప్పటికే రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ప్రభావితం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మరింత ఆ రెండు దేశాల ప్రజలు తలదించుకునే విధంగా అంతర్జాతీయ స్థాయి వేదికపై ఈ రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు ఇలా చిల్లర గొడవ పడటం ప్రతి ఒక్కరికి కోపాన్ని తెప్పిస్తున్నాయి.
ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన వీరు ఇలా వ్యవహరించడంను ఏ ఒక్కరు సమర్థించడం లేదు. రష్యాకు చెందిన ప్రతినిధి మొదట ఉక్రెయిన్ జెండాను లాగి కవ్వించాడు. దాంతో ఉక్రెయిన్ ఎంపీకి కోపం వచ్చింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చాలా మంది ప్రముఖులు మరియు దేశాల ప్రతినిధులు ఖండిస్తున్నారు. హుందాగా ఉండాల్సిన సమావేశంలో ఇలా వ్యవహరించడం పట్ల నిర్వాహకులు ఇరు దేశాల ప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook