వుహాన్ లో ఉరుకులు పరుగులు పెడుతోన్న విద్యార్థులు..

కరోనా మహమ్మారి పుట్టుక, ఉనికికి జన్మస్థానమైన చైనా లోని వుహాన్ నగరం ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటుంది. గత నాలుగైదు నెలలుగా కరోనా కారణంగా అన్నీ రకాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే.

Last Updated : May 6, 2020, 05:10 PM IST
వుహాన్ లో ఉరుకులు పరుగులు పెడుతోన్న విద్యార్థులు..

బీజింగ్: కరోనా మహమ్మారి పుట్టుక, ఉనికికి జన్మస్థానమైన చైనా లోని వుహాన్ నగరం ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటుంది. గత నాలుగైదు నెలలుగా కరోనా కారణంగా అన్నీ రకాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. చైనాలోని వూహాన్‌లో విద్యాసంస్థలు తెరుచుకోవడంతో విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. జనవరిలో కరోనా విజృంభణ నేపథ్యంలో బడులు మూసివేసిన సంగతి తెలిసిందే.

వూహాన్‌ను కరోనా మహమ్మారికి గ్రౌండ్ జీరోగా అభివర్ణిస్తారు. తీవ్రదిగ్బంధనం అనంతరం ఆ నగరంలో కరోనా అదుపులోకి వచ్చింది. ఇప్పుడు కరోనా పూర్తిగా అదుపులోకి రావడంతో వూహాన్‌లో మళ్లీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. పిల్లలు కూడా పాఠశాలలకు వెళుతున్నారు. బుధవారం తొలిరోజు భౌతిక దూరం పాటిస్తూ పిల్లలు మాస్కులు ధరించి బడిలోకి అడుగు పెడుతుంటే సిబ్బంది థర్మామీటర్ గన్‌తో నుదుటి మీద టెంపరేచర్ తీసుకున్నారు. ఎట్టకేలకు బడులు తెరవడంతో ఇటు పిల్లలు, అటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదుల్లో కనీసం మీటరు దూరంతో సీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News