New Variant found in Britain: దీనికి అంతం లేదు మిత్రమా.. బ్రిటన్‌లో వెలుగులోకి కొత్త వేరియంట్ BA.2

New Variant found in Britain: కరోనా మహమ్మారి ఇప్పట్లో ఆగేలా లేదు. ఒకదాని వెంట మరొకటిగా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. బ్రిటన్‌లో ఇప్పుడు మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 23, 2022, 02:54 PM IST
 New Variant found in Britain: దీనికి అంతం లేదు మిత్రమా.. బ్రిటన్‌లో వెలుగులోకి  కొత్త వేరియంట్ BA.2

New Variant found in Britain: కరోనా మహమ్మారి ఇప్పట్లో ఆగేలా లేదు. ఒకదాని వెంట మరొకటిగా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. బ్రిటన్‌లో ఇప్పుడు మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది.

ప్రపంచమంతా కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెంటాడుతోంది. ముఖ్యంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు లక్షల్లో వస్తున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త ఆందోళన ప్రారంభమైంది. యూకేలో మరో కొత్త వేరియంట్ (New Variant in Britain) పుట్టుకొచ్చిందనే వార్త ఆందోళన కల్గిస్తోంది. బ్రిటన్‌లో కొత్తగా BA.2 వైరస్ (BA.2 Variant) వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ కేసులు 426 నమోదయ్యాయని బ్రిటన్ వెల్లడించింది. దీనిని ఒమిక్రాన్‌కు ఉప వేరియంట్‌గా భావిస్తున్నారు. వేరియంట్‌కు మరో వేరియంట్ పుట్టడమనేది ఇదే తొలిసారి అని బ్రిటన్ వైద్య నిపుణులు చెబుతున్నారు.  BA.2 వేరియంట్ కూడా ఒమిక్రాన్ తరహాలోనే అతి వేగంగా సంక్రమిస్తుందని..అంత ప్రమాదకరం కాదని యూకే తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) తరహాలో ఇందులో ఎక్కువ మ్యూటేషన్లు లేవని వైద్యులు స్పష్టం చేశారు. 

మరోవైపు న్యూజిలాండ్ దేశంలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. కరోనా సంక్రమణను దృష్టిలో ఉంచుకుని ఆ దేశ ప్రధాని తన వివాహ వేడుకను కూడా రద్దు చేసుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తిని అరికట్టేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. 

Also read: Live Reporting: లైవ్‌లో ఢీ కొట్టిన కారు, అయినా ఆగని లైవ్ రిపోర్టింగ్, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News