పుల్వామా ఉగ్ర దాడిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

Last Updated : Feb 23, 2019, 07:08 PM IST
పుల్వామా ఉగ్ర దాడిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి మరీ దారుణంగా తయారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 14న జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40కిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని అన్నారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న హింసాత్మక పోరుకు ఇకనైనా తెరపడాలని కోరుకుంటున్నట్టు చెప్పిన ట్రంప్.. రెండు దేశాలతో అమెరికా సర్కార్ చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. 

పుల్వామా దాడిపై విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ''కాశ్మీర్ లోయలో శాంతి స్థాపనకు తమ వంతు కృషిచేస్తాం'' అని స్పష్టంచేశారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పుల్వామా దాడిపై విలేకరులు ప్రస్తావించినప్పుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News