Sri Lankan Lessons: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ప్రస్తుతం రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ఉచిత జపం చేస్తున్నాయి. ఓటర్లకు పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు భారీగా అమలవుతున్నాయి. తమ బడ్జెట్ లో మెజార్టీ ఖర్చు ఉచిత పథకాలే ఖర్చు చేస్తున్నాయి. దీనిపైనే ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులు భవిష్యత్ పై ఆందోళన కల్గిస్తున్నాయి. శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. శ్రీలంక పరిస్థితులను ఉదహరిస్తూ ఉచితాలతో మనకూ అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని ఇటీవలే సీనియర్ ఐఏఎస్ అధికారురుల బృందం ప్రధాని మోడీకి వివరించింది. ఉచిత పథకాలు, సంక్షేమ జపాలు మారకపోతే శ్రీలంక తరహా ఆర్థిక కష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఎస్బీఐ కూడా ఇలాంటి నివేదికే ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత స్కీంలు, పాత పెన్షన్ విధానం, రైతు రుణమాఫీ వంటి హామీలు ఆందోళన కల్గిస్తున్నాయని తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తాజా నివేదికలో తెలంగాణ సర్కార్ పథకాలను ప్రస్తావించింది. తెలంగాణలో రెవిన్యూ ఆదాయంలో 35 శాతం సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నారని వెల్లడించింది. ఇలా చేయడం ఎక్కువ కాలం సాధ్యం కాదని, ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని ఎస్బీఐ తన నివేదికలో హెచ్చరించింది.
తెలంగాణ తరహాలోనే ఏపీ, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, బెంగాల్ , కేరళ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉచితాలకు పెద్ద పీట వేశాయని ఎస్బీఐ తన నివేదికలో పొందు పరిచింది. ఈ రాష్ట్రాలు తమ రాబడిలో ఐదు నుంచి 19 శాతం వరకు ఉచిత పథకాలకే కేటాయిస్తున్నాయని వివరించింది. ఆయా రాష్ట్రాల సొంత పన్ను ఆదాయాని లెక్కలోకి తీసుకుంటే.. సంక్షేమ పథకాల ఖర్చు ఏకంగా 63 శాతం దాకా కూడా ఉంటున్నట్టు ఎస్బీఐ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రాలు తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా ఖర్చుకు సంబంధించిన ప్రాధాన్యాలను సరిచేసుకోవాలని ఎస్బీఐ నివేదిక సూచించింది. లేదంటే ఆర్థిక సంక్షోభాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read: Honey And Garlic Benefits: తేనె-వెల్లుల్లి కలిపి తీసుకోండి.. ఈ వ్యాధులకు చెక్ పెట్టండి
Also Read: Alia Bhatt Pics: పెళ్లైన వెంటనే..షూటింగ్, పింక్ డ్రెస్‌లో అద్దిరిపోతున్న అలియా భట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook