Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు

Good News to Employees: ఉద్యోగులకు శుభవార్త. వారంలో కేవలం నాలుగు రోజులే పని చేయాల్సి ఉంది. మిగతా రోజులంతా మీ ఇష్టం. నాలుగంటే నాలుగు రోజుల పనిదినాలు కల్పిస్తూ కొన్ని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగుల పనిదినాలు, పని గంటలు పెంచాలని భావిస్తున్న ఈ తరుణంలో జర్మనీలో ఉద్యోగులకు అతి తక్కువ పనిదినాలు అమలు చేయాలని పలు కంపెనీలు నిర్ణయించడం విశేషం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 29, 2024, 10:27 PM IST
Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు

Four Days Working: ప్రపంచవ్యాప్తంగా పని దినాల విషయంలో కొత్త కొత్త నిబంధనలు వస్తున్నాయి. కొన్ని సంస్థలు అత్యధిక పని గంటలు ఉండాలని నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరికొన్ని కంపెనీలు సాధ్యమైనంత ఉద్యోగులకు తక్కువ పని గంటలు ఇచ్చి నాణ్యమైన సేవలు పొందాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీలో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఊహించని తీపి కబురు అందిస్తున్నాయి. కేవలం నాలుగు రోజులే పని దినాలు ఉండేలా చూస్తున్నాయి. ఈ మేరకు పైలెట్‌ ప్రాజెక్టుగా కొన్ని కంపెనీలు అమలు చేసి చూడాలని నిర్ణయించాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ విధానం అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి.

ప్రస్తుతం జర్మనీలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతతో విలవిలలాడుతోంది. ఈ సమయంలో అధిక పని దినాలు ఉంటే ఉద్యోగులు సక్రమంగా సేవలు అందించడం లేదని పలు సంస్థలు గుర్తించాయి. పని దినాలు అధికంగా ఉండడం వలన ఉద్యోగుల ఆరోగ్యం, పనితీరు సక్రమంగా లేదని గ్రహించారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల పనిదినాలు అమలు చేయాలని పలు జర్మన్‌ కంపెనీలు నిర్ణయించాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఈ విధానాన్ని అమలు చేయడానికి 45 కంపెనీలు సిద్ధమయ్యాయి. 

వారానికి నాలుగు దినాలే పనులు చేసినా జీతం మాత్రం పూర్తి నెలకు చెల్లిస్తారు. ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న ఈ విధానం ద్వారా ఉద్యోగుల నుంచి నాణ్యమైన ఉత్పాదకత, సేవలు పొందవచ్చని 4డే వీక్‌ గ్లోబల్‌ అనే సంస్థ పేర్కొంది. కొన్ని గంటల పని విధానం ద్వారా ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుందని.. వారి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది. దీంతోపాటు ఉద్యోగుల సెలవుల విషయమై ఎలాంటి పేచి ఉండదని ఆ సంస్థ చెబుతోంది.

Also Read: Kharge Sensational Comments: మోదీ హ్యాట్రిక్‌ కొడితే అసలు ఎన్నికలే ఉండవు.. అంతా నియంత పాలనే
 

Also Read: RS Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News