ఆధునిక బైనరీ సిస్టమ్ కనిపెట్టిన శాస్త్రవేత్త, జర్మనీ గణిత నిపుణుడు గోట్ ఫ్రైడ్ విల్హెమ్ లెబ్నిజ్కు ఆయన జయంతి సందర్భంగా గూగుల్ నివాళులు ఘటించింది. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్‌ను విడుదల చేసింది. 1646 సంవత్సరంలో జన్మించిన లెబ్నిజ్ క్యాలిక్యులేటర్ మెషీన్‌కు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను తొలిసారిగా అధ్యయనం చేశారు.
ఆ విధంగా ఆధునిక కాలిక్యులేటర్ల రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేశారు. డెసిమల్స్ను 0,1 అంకెలుగా మార్చి.. వాటికంటూ ఒక యూనివర్సల్ కోడింగ్ కనిపెట్టడంలో లెబ్నిజ్ ప్రధాన పాత్ర పోషించారు. లెబ్నిజ్ ప్రతిపాదించిన సూత్రాలను అధ్యయనం చేశాకే ఛార్లెస్ బాబేజ్ కంప్యూటర్ కనిపెట్టారు. తత్వశాస్త్రం, లింగ్వెస్టిక్స్, మెడిసిన్, ఫిజిక్స్, జియోలజీ లాంటి సబ్జెక్టులను అధ్యయనం చేసి.. వాటి ఆధారంగా పలు గ్రంథాలు కూడా రాశారు లిబ్నిజ్.
17వ శతాబ్దానికి చెందిన లెబ్నిజ్ అప్పటి ప్రముఖ హేతువాదులలో ఒకరిగా కూడా చెలామణీ అయ్యారు. 1985 నుండీ జర్మనీ ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేషంగా రాణించిన వారికి "లెబ్నిజ్ ప్రైజ్" ఇవ్వడానికి సంకల్పించింది. ఈ ప్రైజ్ క్రింద రూ.1.55 మిలియన్ యూరోలను కూడా అందిస్తోంది. ప్రపంచంలోనే ఫండమెంటల్ ఫిజిక్స్ రంగంలో ఉన్నత స్థాయి గుర్తింపుగా ఈ ప్రైజ్‌ను శాస్త్రవేత్తలు కొనియాడడం గమనార్హం.