Air Pollution Sensors: ఎంతటి వాయు కాలుష్యాన్నైన పసిగట్టే సెన్సర్లు.. ఆ దేశంలో సక్సెస్

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలలో కాలుష్యం కూడా ఒకటి. ముఖ్యంగా వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడే వాటి కారణంగా వాయు కాలుష్యం రెట్టింపు అవుతుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించటానికి హాంగ్ కాంగ్ లో కాలుష్యాన్ని కనిపెట్టే సెన్సార్ లను తీసుకొచ్చారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 01:21 PM IST
  • వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు వినూత్న ఆలోచన
  • హాంకాంగ్‌ ఇక నుంచి వాయు కలుష్యానైన పసిగట్టే సెన్సర్లు
  • 96% వాహనాలు కాలుష్య పరీక్షలో పాస్‌ అయితేనే రోడ్లపైకి
Air Pollution Sensors: ఎంతటి వాయు కాలుష్యాన్నైన పసిగట్టే సెన్సర్లు.. ఆ దేశంలో సక్సెస్

Pollution Detected Sensors: ప్రస్తుతం వాయు కాలుష్యం పట్టణాలు పల్లెలు అని తేడా లేకుండా ప్రతి చోట భూతమై పట్టి పిడుస్తోంది. ముఖ్యంగా సీటీలో ఈ వాయు కాలుష్యం రేటు అధికంగా ఉంది. ఆరోగ్యవంతంగా ఉన్న ప్రజలను అనారోగ్యంగా మార్చుటలో వాయు కాలుష్యం ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. భారత్‌తో కలిసి చాలా దేశాలు దీన్ని తగ్గించటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుండటం అందరికి తెలిసిందే అయితే దీనిని మూలంలోనే అరికట్టగలిగితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. 

ప్రస్తుతం హాంకాంగ్‌ కూడా ఇలాంటి పనికే శ్రీకారం చుట్టింది. కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే వాహనాలను పసిగట్టటంపై దృష్టి సారించింది హాంకాంగ్‌ ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక సెన్సర్ల సాయం తీసుకోవటం విశేషం. పట్టణాల్లో గాలి కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాలు, కార్మగారాల నుంచి వెలువడే పొగే. అయితే దినిని మాత్రం తగ్గించే పని ప్రభుత్వాలదే. 

పెట్రోలు, డీజిల్‌తో నడిచే కార్లు, వ్యాన్లు, లారీలు, బస్సుల నుంచి వెలువడే పొగలో చాలా శాతం కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్ల వంటి హానికర పూరిత వాయువులెన్నో వాతవరణంలో వెలుబడుతాయి. దీంతో క్రమంగా వాతవారణంలో మార్పులు వచ్చి కాలుష్యానికి దారి తీస్తుంది. కొత్త వాహనాల్లో వీటిని నియంత్రించే వ్యవస్థ ఉంటుంది పలు వాహన సంస్థలు తెలిపాయి. కానీ పాత పడుతున్న కొద్దీ కాలుష్యం విడుదల చేయడం సహజం. అందుకే పెద్దమొత్తంలో కాలుష్యాన్ని వెలువరించే వాహనాలను గుర్తించటానికి హాంకాంగ్‌ రోడ్ల పక్కన ప్రత్యేక సెన్సర్లను ఏర్పాటు చేసింది.

ఇవి వాహనాలలోని విడుదలయ్యే పొగలోంచి వెలువడే వాయువులను గుర్తిస్తాయి. కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు తెలియగానే ఆ కెమెరాలు ఆయా వాహనాల నంబరు ప్లేట్లను ఫొటోలు తీస్తాయి. ఆ తర్వాత అధికారులు వాహన యజమానులకు నోటీసులు అందజేస్తాయి. వాహనాలను మరమ్మతు చేసుకొని, పోల్యూషన్‌ పరీక్షలో నెగ్గేంతవరకు అవి తిరిగి రోడ్ల మీదికి ఎక్కటానికి వీలుండ కుండా అధికారులు తగు చర్యలు చేపట్టారు. 

ఇలా గుర్తించిన వాటిల్లో 96% వాహనాలు కాలుష్య పరీక్షలో పాస్‌ అయిన తర్వాతే రోడ్ల మీదికి రావటం విశేషం. ఈ పథకంతో అక్కడ వాయు కాలుష్యం వేగంగా తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ సెన్సర్లను కొన్ని దేశాల్లో ఇప్పటికే పరీక్షిస్తున్నారు. కానీ వీటిని అమలు చేసిన మొదటి దేశంగా హాంకాంగ్‌ చరిత్ర సృష్టించింది.  

Also Read: Harmanpreet Kaur: వావ్.. వాట్ ఏ క్యాచ్ హర్మన్‌ప్రీత్! బహుశా జాంటీ రోడ్స్ కూడా పట్టడేమో (వీడియో)!!

Also Read: India Corona Update: దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా ప్రభావం, 3వేలకు దిగువన కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x